అయోధ్యకు ఎయిర్ ఇండియా విమానాలు..

అయోధ్యకు ఎయిర్ ఇండియా విమానాలు..

అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సమయం దగ్గర పడేకొద్దీ.. ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఎన్నో దేశాల నుంచి ప్రముఖులు అయోధ్య తరలి వస్తుండటంతో.. ఎయిర్ పోర్ట్ నిర్మాణం పనులు శర వేగంగా సాగుతున్నాయి. శ్రీ రాం ఎయిర్ పోర్ట్ గా నామకరణం చేసిన.. అయోధ్య విమానాశ్రయానికి.. ఎయిర్ ఇండియా విమానాలు ప్రారంభించబోతుంది.. డిసెంబర్ 30వ తేదీ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సర్వీసులు ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది ఎయిర్ ఇండియా..

ప్రతి రోజూ ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి అయోధ్యకు 12 గంటల 20 నిమిషాలకు చేరుకుంటుంది.. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాలకు అయోధ్యలో బయలుదేరి.. 2 గంటల 10 నిమిషాలకు ఢిల్లీ చేరుకుంటుంది ఈ సర్వీస్. 

అయోధ్యలో ఎయిర్ పోర్ట్ లో పనులు త్వరలో పూర్తి చేసి.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించటానికి రెడీ అవుతుంది కేంద్ర ప్రభుత్వం. ఈలోపు వివిధ విమాన సంస్థలు.. తమ సర్వీసులను ప్రారంభిస్తున్నాయి. ఇప్పటికే ఇండిగో తమ సర్వీసులు ప్రారంభించగా.. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రారంభించింది. అయోధ్యలో శ్రీరాముడు దర్శనం ప్రారంభం అయితే.. వందలాది విమానాలు కూడా సరిపోవు అనేది ప్రస్తుతం ఉన్న అంచనా.. ఈ క్రమంలోనే భారీ రన్ వేను సిద్ధం చేస్తుంది కేంద్రం..