విద్యా వ్యవస్థను నాశనం చేస్తుండు కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై ఆకునూరి మురళి ఫైర్‌‌‌‌‌‌‌‌

విద్యా వ్యవస్థను నాశనం చేస్తుండు కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై ఆకునూరి మురళి ఫైర్‌‌‌‌‌‌‌‌
  •    ఎడ్యుకేషన్‌‌‌‌ను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపణ
  •     సర్కారు బడుల్లో క్వాలిటీ విద్య అందడం లేదని ఆవేదన
  •     రాష్ట్రంలో విద్యా విధానంపై రౌండ్‌‌‌‌ టేబుల్‌‌‌‌ సమావేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యావ్యవస్థను సీఎం కేసీఆర్ కావాలని నాశనం చేస్తున్నారని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరు మురళి ఆరోపించారు. ఆయనకు ప్రశ్నించే వాళ్లంటే పడదని, మిడిల్ క్లాస్, పేద విద్యార్థులు చదివితే ప్రశ్నిస్తారు కాబట్టి ఎవరికి నాణ్యమైన విద్యను అందించడం లేదన్నారు. శనివారం హైదరాబాద్‌‌‌‌ సోమాజిగూడ ప్రెస్‌‌‌‌క్లబ్‌‌‌‌లో సోషల్ డెమోక్రటిక్ ఫోరమ్(ఎస్‌‌‌‌డీఎఫ్) ఆధ్వర్యంలో “రాష్ట్రంలో విద్య ఎలా ఉండాలి, ఎడ్యుకేషన్‌‌‌‌లో పలు అంశాలతో మేనిఫెస్టో”పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పుస్తకాన్ని ఆకునూరు మురళి, ప్రొఫెసర్ శాంత సిన్హా, పలువురు ఎడ్యుకేషన్ మేథావులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆకునూరు మురళి మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో లోపాలను ఎండగట్టారు. మొక్కుబడిగా విద్య హక్కు చట్టాన్ని కొనసాగిస్తున్నారని, సరైన పర్యవేక్షణ లేకపోవటంతో సర్కార్‌‌‌‌‌‌‌‌ స్కూళ్లల్లో నాణ్యమైన విద్య అందడం లేదని ఆరోపించారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో లిటరసీలో తెలంగాణ చివర నుంచి రెండో స్థానంలో ఉందని ఆకునూరి మురళి పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వ బడుల్లో 60 శాతం పిల్లలు సీ గ్రేడ్‌‌‌‌లో ఉన్నారు. వీరు ఇంటర్మీడియెట్‌‌‌‌కు వెళ్లేసరికి సరైన ఇంగ్లీష్, సబ్జెక్ట్‌‌‌‌ మెళుకువలు రాక ఇబ్బందులు పడుతున్నారు. 11 యూనివర్సిటీల్లో శాంక్షన్డ్‌‌‌‌ పోస్టుల్లో వేలల్లో ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు జరగడం లేదు. యూనివర్సిటీల్లో 3,179 ఖాళీలు ఉన్నాయి. వర్సిటీల్లో వీసీలు లేరు, బాసర ట్రిపుల్‌‌‌‌ఐటీకి 8 ఏండ్ల నుంచి డైరెక్టర్ లేరు. స్కూళ్ల అభివృద్ధికి, మౌలిక సదుపాయాలకు, నాణ్యమైన విద్యను అందించడానికి, టీచర్ల జీతాలకు 15శాతం బడ్జెట్ కేటాయించాలి. రాష్ట్రంలో అమెరికా, జర్మనీ, కెనడా తరహా విద్యా విధానం అందించాలి. ఈ దేశాల్లో 90 శాతం స్కూళ్లను ప్రభుత్వాలే నిర్వహిస్తున్నాయి. ఎల్‌‌‌‌కేజీ నుంచి ఇంటర్ వరకు 75 లక్షల మందికి ఎడ్యుకేషన్ అందించేందుకు ప్రణాళికలు రచించాలి. మంచి ఉద్దేశంతో కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టాన్ని, రాష్ట్రంలో మొక్కుబడిగా అమలు చేస్తున్నారు”అని మురళి అన్నారు. 

ఎస్డీఎఫ్ రిపోర్ట్‌‌‌‌ను అమలు చేయాలి: ప్రొఫెసర్ శాంత సిన్హా

రాష్ట్రంలో విద్యా విధానం ఎలా ఉండాలో సోషల్ డెమోక్రాటిక్ ఫోరమ్ తీసుకొచ్చిన రిపోర్ట్‌‌‌‌ను ప్రభుత్వం అమలు చేయాలని ప్రొఫెసర్ శాంత సిన్హా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ ఉందని, ఇందుకోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ప్రపంచమంతా విద్యా వ్యవస్థ బాధ్యత ప్రభుత్వానిదేనని, మన దేశంలో కూడా ఇలాంటి మార్పు రావాలని సూచించారు. ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రైవేటీకరణ వల్ల చాలా డ్యామేజ్ జరిగిందని ఆమె గుర్తుచేశారు. ప్రభుత్వం విధానాలతో పేద, మధ్య తరగతి పిల్లలు నాణ్యమైన విద్య పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎడ్యుకేషన్ చారిటీ కాదని, ఫండమెంటల్ రైట్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ బాగు పడాలంటే సమూల మార్పులు రావాలని, అందుకోసం స్టేట్‌‌‌‌లోని 621 మండలాల్లో 3 వేల స్కూళ్లు నిర్మించాలని పలువురు ప్రొఫెసర్లు డిమాండ్‌‌‌‌ చేశారు.కార్యక్రమంలో ప్రొఫెసర్లు మురళీమోహన్, లక్ష్మీ నారాయణ, వెంకటరెడ్డి, పృథ్వీరాజ్, జగదీశ్వర్, ప్రీతి సాధిక్, అన్వర్ ఖాన్ హాజరయ్యారు.