ఆ సిగ్నల్స్ ఏలియన్స్ నుంచి వస్తున్నాయా.. అంగారక గ్రహం నుంచి భూమికి మొదటిసారిగా

ఆ సిగ్నల్స్ ఏలియన్స్ నుంచి వస్తున్నాయా..  అంగారక గ్రహం నుంచి భూమికి మొదటిసారిగా

ఏలియన్స్ అంటే సినిమాల్లోనో, పుస్తకాల్లోనో చూసి ఉంటాం. కానీ వాస్తవంగా ఏలియన్స్ అనేవి ఉన్నాయా.. ఒకవేళ ఉంటే అవి ఎలా ఉంటాయి. అనే ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటికీ ప్రశ్నలుగా ఉంటాయి. కొన్ని వింత వస్తువులు లేదా ఆకారాలు కనిపించినట్టు వార్తలు వచ్చినా వాటిపైనా ఎలాంటి క్లారిటీ లేదు. నిజంగా భూమి లోపల గ్రహాంతరవాసులు ఉన్నారనే నమ్మకంతో ఇప్పటికీ కొంతమంది శాస్త్రవేత్తలు అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ నిజంగానే అవి ఉంటే మానవులకు అవి ఏమైనా సంకేతాలిస్తాయా.. అదే ప్రశ్న మరో సారి వినిపిస్తోంది. అందుకు కారణం మొట్టమొదటిసారి అంగారక గ్రహం నుంచి భూమికి ఓ సంకేతం వచ్చిందనే వార్త వైరల్ అవుతోంది. అది ఏలియన్స్ పంపించిందేనా అన్న విషయంపై ఖగోళ శాస్త్రవేత్తలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అంగారక గ్రహం నుంచి ఎన్ కోడ్ చేసి వచ్చిన సమాచారాన్ని యూరప్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఎక్సో మార్స్ ట్రేజ్ గ్యాస్ టార్ (ExoMars Trace Gas Orbiter (TGO) భూమికి చేరవేసింది. TGO మే 24న మధ్యాహ్నాం 3 గంటలకు అంగారక గ్రహం చుట్టు ఉన్న కక్ష్య నుంచి భూమికి ఒక ఎన్ కోడ్ సందేశాన్ని అందించింది. ఇలా ఇతరగ్రహాల నుంచి ఎన్‌కోడెడ్‌ సమాచారం రావడం ఇదే తొలిసారి. దీంతో శాస్త్రవేత్తలు ఆ దిశగా పరిశోధనపై దృష్టి సారించారు.

అంగారకుడి చుట్టూ తిరుగుతూ అక్కడి భిన్న పరిస్థితులను నిశితంగా గమనించేందుకు యూరప్‌ స్పేస్‌ ఏజెన్సీ టీజీవోను గతంలో ప్రయోగించింది. ఈ సందేశాన్ని గ్రహాంతర వాసులే పంపించారా? అనే దానిపై స్పష్టత లేదు. కానీ అంగారక గ్రహం నుంచి సమాచారాన్ని స్వీకరించిన టీజీవో... కేవలం 16 నిమిషాల్లోనే ఆ సందేశాన్ని ఎర్త్‌ స్టేషన్‌కు అందించింది. అందులో ఏముందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒక వేళ అది గ్రహాంతర వాసులే పంపిన సమాచారమైతే.. ఈ ఘటన చరిత్రలో నిలిచిపోతుందని కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలోని SETI  (search for extraterrestrial intelligence)‘ఎ సైన్స్‌ ఇన్‌ స్పేస్‌’ ప్రాజెక్టులో భాగమైన మహిళా శాస్త్రవేత్త డానియేలా ది పౌలిస్‌ చెప్పారు.