
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఐ బొల్లారంలో అమర్ ల్యాబ్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఐదుగురుకార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన కార్మికులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.