రామ్ పోతినేని 'ఆంధ్ర కింగ్ తాలూకా' విడుదల తేదీ ఖరారు.. ఈ సారైనా లక్ కలిసొచ్చేనా?

రామ్ పోతినేని 'ఆంధ్ర కింగ్ తాలూకా' విడుదల తేదీ ఖరారు.. ఈ సారైనా లక్ కలిసొచ్చేనా?

యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'ఆంధ్ర కింగ్ తాలూకా' . ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా  ఈ సినిమాను నవంబర్ 28న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. యువ దర్శకుడు పి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ సినిమా కథాంశం ఒక ప్రత్యేకమైన నేపథ్యాన్ని కలిగి ఉందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇందులో రామ్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర వీరాభిమానిగా కనిపించనున్నారు. అంతేకాకుండా, ఈ సినిమా కేవలం ఒక అభిమాని కథ మాత్రమే కాదు, అన్ని రకాల అభిమానులకు అంకితమిచ్చినట్లుగా ఉంటుంది. ఈ విషయాన్ని రామ్ పోతినేని స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "ప్రియమైన మెగా, లయన్, కింగ్, విక్టరీ, పవర్, సూపర్, రెబల్, టైగర్, మెగాపవర్, స్టైలిష్, రియల్, రజనీ..  ఫ్యాన్స్ తో పాటు ఇతర స్టార్స్ ఫ్యాన్స్ అందరికీ, మిమ్మల్ని మీరు తెర మీద చూసుకునే సినిమా ఇది అని రామ్ పేర్కొన్నారు.

ఈ సినిమాకు వివేక్-మెర్విన్ సంగీతం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌ అందిస్తున్నారు. హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఒక అద్భుతమైన ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని నిర్మాతలు తెలిపారు. ఈ స్పెషల్ పోస్టర్ అభిమానులలో సినిమాపై మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమాతో రామ్ పోతినేని ఈ సారి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.