పార్టీకి అంబులెన్స్ లో జూనియర్ డాక్టర్లు.. సైరెన్ వేస్తూ ఓవర్ స్పీడ్

పార్టీకి అంబులెన్స్ లో జూనియర్ డాక్టర్లు.. సైరెన్ వేస్తూ ఓవర్ స్పీడ్

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. గర్బా ఆడేందుకు ట్రైనీ వైద్యులు సైరన్‌తో అంబులెన్స్‌లో బయలుదేరారు. వైద్యపరమైన అత్యవసర పరిస్థితులకు నియమించబడిన ఈ వాహనాన్ని వారు వేడుక కోసం వాడుకున్నారు. హాకీ స్టేడియం సమీపంలో రేసింగ్‌ను చూసిన తర్వాతే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వావాహనం రిజిస్ట్రేషన్ నంబర్ MH-09 FL-6709 కాగా.. అది గోఖలే కళాశాల వైపు వెళుతున్నట్టు కొందరు గమనించారు. ఈ వాహనం సైరన్‌లు మోగిస్తూ, అత్యవసర పరిస్థితిని సూచిస్తూ ఉంది. కానీ దాన్ని వారు వేరే పనికి ఉపయోగిస్తున్నారని ఎవరికి తెలుసు?

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక వీడియోలో గర్బా వేడుకల కోసం చాలా మంది ట్రైనీ డాక్టర్లు వాహనంలో వెళ్తున్నట్టు చూపిస్తుంది. ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేపింది. ఆ ట్రైనీలను కటకటాల వెనక్కి నెట్టండి, అప్పుడే వారికి అంబులెన్స్  విలువ తెలుస్తుందంటూ కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.

Also Read :- పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు