పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు...9 మంది మృతి

పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు...9 మంది మృతి

తమిళనాడులో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు.  వివరాల్లోకి వెళ్తే..

విరుదునగర్ జిల్లా కమ్మపట్టి గ్రామంలోని కనీసగఢ్ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవింంది. ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు. ఈ బాణాసంచా కర్మాగారం ముందు బాణాసంచా దుకాణం కూడా నడుస్తోంది. అయితే షాపులో ఉన్న పటాకులను తీసి కాలుస్తున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా షాపు లోపల పేలుడు సంభవించింది. ఈ క్రమంలో షాపులోని పటాకులు పేలాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాురు.