ఆఫ్ఘనిస్థాన్ ఆపద్ధర్మ అధ్యక్షుడ్ని నేనే: అమ్రుల్లా సలేహ్

 ఆఫ్ఘనిస్థాన్ ఆపద్ధర్మ అధ్యక్షుడ్ని నేనే: అమ్రుల్లా సలేహ్
  • తనకు తాను  ప్రకటించుకున్న ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ 

కాబుల్: ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు గంటగంటకూ మారిపోతున్నాయి. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని, అర్థం కాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలే కాదు.. పాలకులు, దేశ విదేశాల ప్రభుత్వాలు సైతం తమ ప్రతినిధులు పంపే సమచారానికి భిన్నమైన సమాచారం సోషల్ మీడియాలో వస్తోంది.  తాజాగా ఆఫ్ఘనిస్తాన్ తొలి ప్రజా ప్రభుత్వం అధ్యక్షుడు ఆష్రఫ్ ఘనీ దేశం విడిచి పలాయనం చిత్తగించడంతో.. రాజ్యాంగం ప్రకారం నేనే అధ్యక్షుడిని అంటూ ఆ దేశ తొలి ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ట్వీట్ చేశారు. తనకు తాను ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ఆయన ప్రకటించుకున్నారు. తాను ప్రస్తుతం దేశంలోనే ఉన్నానని, ఆప్ఘనిస్తాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు లేని సమయాల్లో ఉపాధ్యక్షుడే ఆపద్ధర్మ అధ్యక్షుడిగా పాలన నడిపిస్తారని గుర్తు చేశారు. అధ్యక్షుడిగా అందరి మద్దతు కూడగట్టేందుకు, ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని రాసుకున్నారు. ఆయన ట్వీట్ యధాతథంగా ఇలా ఉంది.