వరల్డ్‌‌ జూనియర్‌‌ స్క్వాష్‌‌ చాంపియన్షిప్ ఫైనల్లో అనహత్‌‌ సింగ్‌‌

వరల్డ్‌‌ జూనియర్‌‌ స్క్వాష్‌‌ చాంపియన్షిప్ ఫైనల్లో అనహత్‌‌ సింగ్‌‌

ఒంటారియో: ఇండియా స్క్వాష్‌‌ ప్లేయర్‌‌ అనహత్‌‌ సింగ్‌‌.. వరల్డ్‌‌ జూనియర్‌‌ స్క్వాష్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీస్‌‌లో టాప్‌‌ సీడ్ అనహత్‌‌ 11–3, 8–11, 11–4, 11–6తో బార్బ్‌‌ సమేహ్‌‌ (ఈజిప్ట్‌‌)ను ఓడించింది.

దాంతో 2005 తర్వాత ఈ టోర్నీలో టైటిల్ ఫైట్‌‌కు అర్హత సాధించిన తొలి ఇండియన్‌‌ ప్లేయర్‌‌గా రికార్డులకెక్కింది. 2005లో జోష్న చిన్నప్ప ఈ ఘనత సాధించింది.

హోరాహోరీ మ్యాచ్‌‌లో అనహత్‌‌ రెండో గేమ్‌‌లో వెనకబడింది. కానీ తర్వాతి గేమ్‌‌ల్లో అదిరిపోయే పెర్ఫామెన్స్‌‌ చూపెట్టింది. టైటిల్‌‌ ఫైట్‌‌లో అనహత్‌‌.. రెండో సీడ్‌‌ రుఖియా సలేమ్‌‌ (ఈజిప్ట్‌‌)తో తలపడుతుంది.