ఏపీలో కొత్త జడ్పీ చైర్మన్లు.. వైస్ ఛైర్మన్లు వీరే

 ఏపీలో కొత్త జడ్పీ చైర్మన్లు.. వైస్ ఛైర్మన్లు వీరే

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్ లను అధికార వైసీపీ కైవసం చేసుకుంది. ఇంత వరకు ఒక్కరు చొప్పున వైస్ ఛైర్మన్లు ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం తాజాగా పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు చేసి ఇద్దరేసి వైస్ ఛైర్మన్లను ఎన్నుకునే వెసులుబాటు తీసుకొచ్చింది. ఈ నేపధ్యంలో తొలిసారిగా జిల్లా పరిషత్ లలో ఇద్దరేసి వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు.  ఏపీలో కొత్తగా ఎంపికైన జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్ ఛైర్మన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా..                   జిల్లా పరిషత్ చైర్మన్..             జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్లు
అనంతపురం  - బోయ గిరిజమ్మ    -    కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి, నాగరత్న 
చిత్తూరు       - శ్రీనివాసులు       -     ధనుంజయ్‌రెడ్డి, రమ్య
తూ.గోదావరి - వేణుగోపాల రావు   -    బుర్రా అనుబాబు, మేరుగు పద్మలత
ప.గోదావరి   - కవురు శ్రీనివాస్     -   పెనుమాల విజయబాబు, శ్రీలేఖ
గుంటూరు   - హెనీ క్రిస్టినా          -    బత్తుల అనురాధ, శొంఠిరెడ్డి నర్సిరెడ్డి
కర్నూలు    - వెంకట సుబ్బారెడ్డి   - దిల్షాద్‌ నైక్‌, కురువ బొజ్జమ్మ
కృష్ణా        - ఉప్పాళ్ల హారిక         - గరికపాటి శ్రీదేవి, గుడిమల కృష్ణంరాజు
నెల్లూరు   -  ఆనం అరుణమ్మ     - శ్రీహరి కోట లక్ష్మమ్మ, చిగురుపాటి లక్ష్మీ ప్రసన్న
ప్రకాశం   -  వెంకాయమ్మ            - యన్నాబత్తిన అరుణ,    సుజ్ఞానమ్మ  
కడప   - ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి   - జేష్టాది శారద, పిట్టు బాలయ్య 
విశాఖపట్టణం - జల్లిపల్లి సుభద్ర        -  తుంపాల అప్పారావు, భీశెట్టి సత్యవతి 
విజయనగరం - మజ్జి శ్రీనివాసరావు - అంబటి అనిల్‌కుమార్‌, బాపూజీ నాయుడు
శ్రీకాకుళం జిల్లా - విజయ            - సిరిపురపు జగన్మోహన్‌రావు, పాలిన శ్రావణి