హుజూరాబాద్ దళిత బంధుకు మరో 500కోట్లు

హుజూరాబాద్ దళిత బంధుకు మరో 500కోట్లు

హైదరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం నిధుల వరద పారిస్తోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టు నిర్వహణకు గురువారం మరో 500 కోట్ల రూపాయలు విడుదల చేసింది. కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ నిధులు విడుదల చేసింది. దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు కోసం ఈనెల 16వ తేదీన హుజూరాబాద్ ప్రారంభోత్సవం సభలో సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ. 2000 కోట్ల నిధుల లక్ష్యం ఇవాళ విడుదల చేసిన రూ. 500 కోట్లతో సంపూర్ణమైంది.పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నిర్దేశించిన లక్ష్యానికి పూర్తి శాతం నిధులు కూడా విడుదల అయ్యాయి. దీంతో ఇక దళిత బంధు పథకం నిబంధనలను అనుసరిస్తూ సీఎం కేసీఆర్ సూచనల మేరకు చక చకా అమలు చేయడమే మిగిలింది.
దళిత బంధు పైలట్ ప్రాజెక్టు కోసం నిధుల విడుదల వివరాలు: 
 9.8.21వ తేదీన రూ. 500 కోట్లు
23.8.21వ తేదీన  రూ. 500 కోట్లు
24.8.21వ తేదీన  రూ. 200 కోట్లు
25.8.21  తేదీన రూ. 300 కోట్లు
26.8.21వ తేదీన  రూ. 500 కోట్లు
మొత్తం:  రూ. 2000 కోట్లు