మహాలక్ష్మి స్కీమ్ కోసం స్పెషల్ ఆఫీసర్లు : అనుదీప్ దురిశెట్టి

మహాలక్ష్మి స్కీమ్ కోసం స్పెషల్ ఆఫీసర్లు : అనుదీప్ దురిశెట్టి

హైదరాబాద్, వెలుగు: మహాలక్ష్మి స్కీమ్​కోసం హైదరాబాద్ జిల్లాలోని ప్రతి సెగ్మెంట్​లో స్పెషల్​ఆఫీసర్లను నియమించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్​లోని కాన్ఫరెన్స్ హాల్​లో ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాలకు అధికారుల టీమ్స్​ను  నియమించాలని సూచించారు.

ల్యాండ్ బ్యాంక్ జాబితాలను సిద్ధం చేయాలని జిల్లాలోని తహసీల్దార్లను ఆదేశించారు. కోర్టు కేసులను త్వరగా పూర్తి చేయాలన్నారు.  ల్యాండ్ బ్యాంక్ కోర్టు కేసులకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ కోర్టు కేసు మేనేజ్ మెంట్ సిస్టమ్ ను డెవలప్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, డీఆర్వో, అధికారులు పాల్గొన్నారు.