కవిత నిర్దోషి అయితే బెయిల్ ఎందుకు రాలె?: అనురాగ్ సింగ్ ఠాకూర్

కవిత నిర్దోషి అయితే బెయిల్ ఎందుకు రాలె?: అనురాగ్ సింగ్ ఠాకూర్
  •     రాహుల్, అసదుద్దీన్​ది ఔరంగజేబ్ స్కూల్: అనురాగ్ సింగ్ ఠాకూర్ 

హైదరాబాద్, వెలుగు :  లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్​తో సహా నిందితులంతా జైలుకు పోయారని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. లిక్కర్​ స్కాం కేసులో నిజంగా కవిత నిర్దోషి అయితే, బెయిల్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తెలంగాణలో దోచుకున్నది చాలదన్నట్టు ఢిల్లీకి వెళ్లి దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. రాహుల్ గాంధీ, ఒవైసీ ఇద్దరూ ఔరంగజేబు స్కూల్ కు చెందిన వారేనని విమర్శించారు.

బుధవారం హైదరాబాద్​లోని బీజేపీ స్టేట్​ఆఫీసులో అనురాగ్​సింగ్ మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో బీజేపీ పార్టీ మహిళా నేత చేతిలో ఓడిపోయారని.. అసదుద్దీన్ ఒవైసీ ఇప్పుడు హైదరాబాద్ లో తమ పార్టీ మహిళా అభ్యర్థి చేతిలో ఓడిపోవడం ఖాయమని అన్నారు. ఈ ఎన్నికల్లో వయనాడ్​లో రాహుల్ ఓడిపోతున్నారని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 40 సీట్లకు కూడా గెల్చుకోలేదని ఎద్దేవా చేశారు.