దత్త తండ్రి.. దత్త పుత్రుడు.. అభివృద్దిని అడ్డుకుంటున్నారు

దత్త తండ్రి.. దత్త పుత్రుడు..  అభివృద్దిని అడ్డుకుంటున్నారు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం  ( జనవరి 3) కాకినాడలో పర్యటించారు. నగరంలో రూ. 94కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను వర్చువల్ విధానం ద్వారా జగన్ ప్రారంభించారు. అనంతరం సీఎం  జగన్ మాట్లాడుతూ... చంద్రబాబు.. పవన్​ ను తనదైన స్టైలో విమర్శించారు. దత్త తండ్రి.. దత్త పుత్రుడు.. కలిసి ఏపీ అభివృద్దికి ఆటంకం కలిగిస్తున్నారంటూ...అవినీతిపై ప్రశ్నిస్తానన్న దత్త పుత్రుడు... టీడీపీహయంలో జరిగన అవినీతి గురించి దత్త తండ్రిని ఎందుకు ప్రశ్నించరని  పవన్​ కళ్యాణ్​ ను ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్‌ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చారు పేదవారికి 3 సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంటు కూడా ఇ‍వ్వలేదని మండిపడ్డారు.

చంద్రబాబు హయాంలో పెన్షన్‌ తీసుకోవాలంటే లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదని.. జన్మభూమి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయించేవారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దుయ్యబట్టారు. చంద్రబాబు అవినీతిలో పవన్‌ కూడా పార్ట్‌నరే నంటూ... అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకెళ్లి దత్తపుత్రుడు పరామర్శించాడు. ఇళ్ల నిర్మాణాన్ని ఆపాలనే దత్తపుత్రుడి దిక్కుమాలిన ఆలోచన. చంద్రబాబు అవినీతిలో పార్ట్‌నర్‌ కాబట్టే దత్తపుత్రుడు ప్రశ్నించడు’’ అంటూ సీఎం జగన్‌ ధ్వజమెత్తారు.

రాబోయే రోజుల్లో మరిన్ని కుట్రలకు తెరతీస్తారు.   పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారు. మీరందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. మీ బిడ్డకు వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పడం రాదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడు, ఇక్కడ ప్రజలనే. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారు  అంటూ సీఎం జగన్‌ మండిపడ్డారు.

 పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంలో పేదలకు నిర్మిస్తున్న ఇండ్లలో అవినీతి జరిగిందని, విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖపై కాకినాడ సభలో సీఎం జగన్​ స్పందించారు.  చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ....  వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి పేదవారికి ఇండ్లు ఉండాలనే లక్ష్యంతో ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని జగన్ అన్నారు. ఈ క్రమంలో 31లక్షల మందికి మహిళల పేరుపై ఇండ్ల పట్టాలు ఇచ్చామని, మరో 20లక్షల ఇండ్లు  నిర్మాణంలో ఉన్నాయని సీఎం జగన్ అన్నారు. పేద ప్రజలకు సొంతిల్లు ఉండాలని నేను తాపత్రయ పడుతుంటే.. దానిలో అవినీతి జరిగిందని, విచారణ జరిపించాలంటూ చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ కేంద్రానికి లేఖ రాశాడని, తద్వారా పేదలకు ఇచ్చే ఇండ్లనుసైతం అడ్డుకోవాలని చంద్రబాబు, పవన్ కుట్రపన్నుతున్నారని జగన్ ఆరోపించారు.