అమెరికన్ టెక్ కంపెనీ Apple త్వరలో AppMigrationKit అనే కొత్త టూల్ తీసురాబోతుంది. దీని ద్వారా Android, iPhoneలకి మధ్య మారడం చాలా ఈజీ అవుతుంది. ఈ టూల్ iOS ఇంకా Android ఫోన్ల మధ్య యాప్ డేటాను ట్రాన్స్ఫర్ చేయడానికి రూపొందించారు. అలాగే iOS 26 వెర్షన్లకు సపోర్ట్ చేస్తుంది.
ముఖ్యంగా AppMigrationKit యాప్ డేటాను ఒక ఫోన్ నుండి డౌన్ లోడ్ చేసుకోవడానికి లేదా మరొక ఫోన్‌కి పంపడానికి రెండింటికీ సపోర్ట్ చేస్తుంది. సమాచారం ప్రకారం, కొత్త iOS 26.1 బీటాలో AppMigrationKit గురించి వివరాలు ఉన్నాయి. ఇది డెవలపర్లు వాళ్ళ యాప్‌లను ఈ వన్-టైమ్ డేటా ట్రాన్స్ఫర్ సిస్టమ్‌తో కనెక్ట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. అంటే iPhone, Android ఫోన్ల మధ్య డేటాను ట్రాన్స్ఫర్ చేయడం సింపుల్ అన్నమాట. దీనితో ఎవరైనా ఫోన్ మార్చినప్పుడు సమాచారం కొత్త ఫోన్లోకి వెళ్తుంది.
యాప్ డెవలపర్స్ యాప్స్ డేటాను డౌన్ లోడ్ చేయాలా, ట్రాన్స్ఫర్ చేయాలా లేదా రెండూ చేయాలా అని అడుగుతుందని చెబుతున్నారు. AppMigrationKit అనేది కేవలం వేర్వేరు ప్లాట్‌ఫామ్‌ల (iOS నుండి Android వంటివి) మధ్య డేటా ట్రాన్స్ఫర్ కోసం మాత్రమే, అలాగే ఒకే రకమైన సిస్టమ్స్ (iOS నుండి iPadOS వంటివి) మధ్య డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి సపోర్ట్ చేయదని Apple స్పష్టం చేసింది.
ఈ కొత్త AppMigrationKit టూల్ iPhone సెట్టింగ్‌లోని 'ఆండ్రాయిడ్‌కు ట్రాన్స్ఫర్' (Transfer to Android) అప్షన్ తో పనిచేస్తుంది. డేటా ట్రాన్స్ఫర్ సమయంలో ఏది ట్రాన్స్ఫర్ చేయాలి, ఏది చేయకూడదు అనేది ఈ టూల్ చూపిస్తుంది. AppMigrationKit ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనేది ఖచ్చితంగా తెలియకపోయినా, ఈ సమాచారం బట్టి చూస్తే ఈ ఫీచర్ త్వరలో రాబోయే iOS 26.1 అప్డేట్తో వస్తుందని చెబుతున్నారు.
