ఎప్​సెట్‌‌‌‌లో గురుకుల విద్యార్థుల సత్తా

ఎప్​సెట్‌‌‌‌లో గురుకుల విద్యార్థుల సత్తా
  • ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ విభాగాల్లో ఉత్తమ ర్యాంకులు
  • ర్యాంకర్లకు మంత్రి పొన్నం అభినందనలు

హైదరాబాద్, వెలుగు: ఎప్ సెట్ రిజల్ట్స్‌‌‌‌లో గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. ఎస్సీ గురుకులాల నుంచి ఇంజనీరింగ్ విభాగంలో 953 హాజరు కాగా, అందరూ ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్ అండ్‌‌‌‌ ఫార్మా నుంచి 859 మంది పరీక్ష రాయగా, 857 మంది అర్హత సాధించినట్లు ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి తెలిపారు. నార్సింగి కాలేజీకి చెందిన ప్రవళిక 1,091 ర్యాంకు, ఫలక్‌‌‌‌నుమా కాలేజీ నంచి చైతన్య 1,769 ర్యాంకు, గౌలిదొడ్డి నుంచి అమృత ర్యాంకులు సాధించినట్లు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

 13 మందికి 5 వేల లోపు, 45 మందికి 10 వేల లోపు, 136 మందికి 20 వేల లోపు ర్యాంకులు వచ్చాయన్నారు. అగ్రికల్చర్ నుంచి ప్రవళిక 175వ ర్యాంకు, మహదేవ్‌‌‌‌ 177వ ర్యాంకు, రోహిత్‌‌‌‌ 184వ ర్యాంకు, మూర్తి 249వ ర్యాంకు సాధించారన్నారు. 19 మందికి వెయ్యి లోపు ర్యాంకులు, 67 మందికి 5 వేల లోపు ర్యాంకులు, 183 మందికి 10 వేల లోపు, 20 వేల లోపు 387 మందికి ర్యాంకులు వచ్చినట్లు ఆమె తెలిపారు. 

బీసీ గురుకుల విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు..

ఇంజినీరింగ్ విభాగంలో 66 మంది బీసీ గురుకుల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారని బీసీ గురుకుల సెక్రటరీ సైదులు తెలిపారు. వీరిలో పది వేల లోపు ర్యాంకులు 18 మంది సాధించారన్నారు. ఇంజనీరింగ్‌‌‌‌లో ప్రణయ 496 ర్యాంకు, సాకేత్ 1,562, మనీష 1,814 ర్యాంకు సాధించారని వెల్లడించారు. అగ్రికల్చర్ అండ్‌‌‌‌ ఫార్మసీ విభాగంలో 35 మంది విద్యార్థులకు అత్యధిక ర్యాంకులు వచ్చాయన్నారు. పది వేల లోపు ర్యాంకులు 23 మంది విద్యార్థులకు వచ్చాయని వెల్లడించారు. 

ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ వెల్ఫేర్ సెక్రటరీ శ్రీధర్, గురుకుల సెక్రటరీ సైదులు అభినందించారు. వచ్చే ఏడాది మరిన్ని ర్యాంకులు సాధించేలా కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విద్య, భోజన వసతులు ఉపయోగించుకుని ఉన్నత విద్యావంతులు కావాలని ఆకాంక్షించారు. ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల ప్రవేశ పరీక్షలకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరిన్ని సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.