మహేష్ బాబు ట్వీట్ కు ఏఆర్ రెహమాన్ స్పందన

V6 Velugu Posted on Sep 26, 2021

సారంగ దరియా.. దాని కుడి భుజం మీద కడవా.. ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా విన్నా 'లవ్‌ స్టోరీ' పాటలే. శేఖర్ కమ్ముల ఏ ముహూర్తంలో ఈ పాటను  ప్రీరిలీజ్ చేశాడో గాని.. తెలుగు గడ్డను ఊపేసింది. ఎట్టకేలకు సినిమా రిలీజ్ కావడంతో  'సారంగదరియా' పాటతోపాటు లవ్ స్టోరీ సినిమాలోని పాటల మేనియా పీక్ కు చేరింది. సారంగ దరియా పాట తెలుగు గడ్డపైనే కాదు ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని నెలల నుంచి మార్మోగి పోతున్నవిషయం తెలిసిందే.
ఎట్టకేలకు లవ్ స్టోరీ సినిమా విడుదల కావడంతో సినిమాలోని దాదాపు అన్ని పాటలూ ఆడియా కేటగిరీలో సూపర్ హిట్లుగా నిలుస్తున్నాయి. సినిమాకు సంగీతమే పెద్ద అసెట్‌ అనే టాక్ వినిపిస్తోంది. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. లవ్ స్టోరీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నానంటూ చెప్పిన మహేష్ బాబు సినిమా రిలీజ్ తర్వాత మరోసారి స్పందించారు. లవ్ స్టోరీ సినిమాకు మ్యూజిక్‌ అందించిన సీహెచ్‌ పవన్‌ను అభినందించారు. లవ్ స్టోరీ మ్యూజికల్‌ స్కోర్‌ అద్భుతంగా ఉందని ట్వీట్‌ చేస్తూ... సినిమాకు స్వరాలు సమకూర్చిన పవన్‌ ఏఆర్‌ రెహ్మాన్‌ శిష్యుడని తెలిసి సంతోషం కలిగిందంటూ ఆయనకు కూడా ట్యాగ్‌ చేశారు.
 ''రెహమాన్‌ సార్‌... మీరు గర్వించదగ్గ మ్యూజిక్‌ డైరెక్టర్‌'' అని మహేష్ బాబు పేర్కొన్నారు. ఈ ట్వీట్ ను చూసిన ఏఆర్‌ రెహ్మాన్‌ స్పందించారు. మహేష్‌బాబు మాటలు ముమ్మాటికి నిజమేనని అంగీకరించారు. తన మ్యూజిక్‌ స్టూడియోలో సూపర్‌ టాలెంటెడ్‌ వ్యక్తి పవన్‌ అని, అతని విజయం తామందరికి గర్వకారణమంటూ ఏఈర్ రెహమాన్ ట్వీట్‌ చేశారు. మహేష్ బాబు ట్వీట్ కు ఏఆర్ రెహమాన్ స్పందించడం.. అది కూడా మ్యూజికల్ హిట్ గా నిలుస్తున్న లవ్ స్టోరీ సినిమా కోసం కావడం హాట్ టాపిక్ గా మారింది. 
 

Tagged tollywood, Mahesh babu, ar rahman, Telugu film industry, Love Story Movie, , sekhar kammula\'s movie, telugu movie love story, naga chaitanya sai pallavi, mahesh babu tweets, ar rahman tweets

Latest Videos

Subscribe Now

More News