హెలికాప్టర్కు వేలాడుతూ గాల్లో పుల్ అప్స్

 హెలికాప్టర్కు వేలాడుతూ గాల్లో పుల్ అప్స్

గిన్నిస్​ వరల్డ్ రికార్డు బుక్​లో తమ పేరు చూసుకుని మురిసిపోవాలి అనుకుంటారు చాలామంది. అందుకోసం రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అయితే, ఇతను ఎక్కువ పుల్​ అప్స్​ తీసి గిన్నిస్​ రికార్డుల్లోకి ఎక్కాలి అనుకున్నాడు. అలాగని అందరిలా జిమ్​లో కాకుండా గాల్లో పుల్​ అప్స్​ తీశాడు. అది కూడా హెలికాప్టర్​ ల్యాండింగ్​ స్లైడ్​ పట్టుకుని. ఇతని పేరు రోమన్​ సహ్రద్యాన్. అర్మేనియా దేశానికి చెందిన ఇతను పోలీస్​ డిపార్ట్​మెంట్​లో కాంట్రాక్ట్​ ఉద్యోగి. హెలికాప్టర్ కొంచెం ఎత్తులో గాల్లోకి లేవగానే​ ల్యాండింగ్​ స్లైడ్​ పట్టుకుని చకచకా 23 పుల్​అప్స్ తీశాడు రోమన్. ఒక నిమిషంలో ఎక్కువ హెలికాప్టర్ పుల్ అప్స్​ చేసిన వ్యక్తిగా రికార్డు క్రియేట్​ చేశాడు​. 
ఇతను గాల్లో పుల్​ అప్స్​ చేస్తున్న వీడియో ఇంటర్నెట్​లో వైరల్​ అవుతోంది. వీడియోని ఇప్పటికే 78 వేల మందికి పైగా చూశారు. ఈ వీడియోని గిన్నిస్​ వరల్డ్​ రికార్డ్​ తమ ఇన్​స్టా పేజీలో పోస్ట్​ చేసింది కూడా. గతంలో రోమన్​ జిమ్నాస్టిక్​ హై బార్​ జెయింట్స్​ విన్యాసాలు చేసి గిన్నిస్​లోకి ఎక్కాడు రోమన్.