కేంద్రం ఆర్డినెన్స్‌ ప్రజాస్వామ్యానికి విఘాతం... గవర్నర్లతో రాజకీయం చేస్తోంది

కేంద్రం ఆర్డినెన్స్‌ ప్రజాస్వామ్యానికి విఘాతం... గవర్నర్లతో రాజకీయం చేస్తోంది

ఢిల్లీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ ప్రజాస్వామ్యానికి విఘాతం అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే ప్రధాని మోదీ ఆర్డినెన్స్ తీసుకొచ్చారని మండిపడ్డారు. కేంద్రం ఆర్డినెన్స్ ఢిల్లీ ప్రజలకు అవమానం అని చెప్పారు. కేంద్రం ఆర్డినెన్స్ తో ఢిల్లీ సీఎంగా తాను కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నానని..  తక్షణమే ఆర్డినెన్స్ ను  ప్రధాని నరేంద్ర మోదీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 

షీలా దీక్షిత్ సీఎంగా ఉన్నప్పుడు ఆమెకు అన్ని అధికారాలున్నాయని..కానీ ఇప్పుడు ప్రధాని మోదీ వచ్చాక పోయాయని కేజ్రీవాల్ అన్నారు. ఆర్డినెన్స్ ను పార్లమెంట్ లో వ్యతిరేకిస్తామన్నారు. రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేదని..విపక్షాలు ఏకమైతే బిల్లు పాసవ్వదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అధికారుల బదిలీలన్ని ఢిల్లీ ప్రభుత్వ ఆమోదంతోనే జరగాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అయినా కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందని మండిపడ్డారు. 

దేశంలో కేంద్ర ప్రభుత్వ ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయని కేజ్రీవాల్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. బీజేపీయేతర ప్రభుత్వాలను కేంద్రం చాలా ఇబ్బంది పెడుతోందన్నారు. రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ప్రభుత్వాలను పడగొడుతున్నారని మండిపడ్డారు. గవర్నర్లతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో భయంకరపరిస్థితులు నెలకొన్నాయన్నారు.