
- అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
అన్నపురెడ్డిపల్లి, వెలుగు: ప్రభుత్వ కొలువుల కోసం ఎదురుచూడకుండా, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. సోమవారం మండల పరిధిలో ని ఎర్రగుంట,చుండ్రుగొండ మండలం సీతాయి గూడెం గ్రామాలకు చెందిన ఎస్కే. సుభాని, కీసరి వెంకటేశ్వర్లు కి చెందిన చికెన్ సెంటర్, నెట్ సెంటర్ లను ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువత ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు కృషి చేస్తుందన్నారు.రాష్టం లో నూతన పరిశ్రమలు ఏర్పాటు కు తోడ్పాటు నందిస్తూ స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశా లను కల్పిస్తుందన్నారు.
యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా తమ కాళ్ళమీద తాము నిలబడేలా ఉపాధిని ఎంచుకొని కుటుంబానికి ఆసరాగా నిలవాలని అన్నారు.ఈ కార్యక్రమం లో నాయకులు పర్సా వెంకటేశ్వరావు, బానోత్ భీముడు, కట్ట శివ,కీసరి భద్రయ్య,ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.