ఆస్ట్రియాలో మ‌ళ్లీ లాక్‌ డౌన్‌

ఆస్ట్రియాలో మ‌ళ్లీ లాక్‌ డౌన్‌

ఆస్ట్రియాలో మ‌ళ్లీ క‌రోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ఆ దేశంలో మ‌రోసారి లాక్‌డౌన్ అమ‌లు చేయ‌నున్నారు. సోమ‌వారం నుంచి పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ అమ‌లులోకి రానున్న‌ది. ప్ర‌స్తుతం వ్యాక్సిన్ వేసుకోని వారికి లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తోంది. క‌నీసం ప‌ది రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ ఉంటుంద‌ని ఆస్ట్రియా ఛాన్స‌ల‌ర్ అలెగ్జాండ‌ర్ ష‌ల్క‌న్‌బ‌ర్గ్ తెలిపారు.

ఒకవైపు వ్యాక్సినేష‌న్ త‌క్కువ స్థాయిలో ఉండటం..మరోవైపు  కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆస్ట్రియా త‌ర‌హాలోనే ఇత‌ర యురోపియ‌న్ దేశాలు కూడా లాక్‌డౌన్ అమ‌లు చేసే ఆలోచ‌న‌లో ఉన్నాయి. వ్యాక్సిన్ వేసుకోని వారి కోసం స్లోవేకియా ప్ర‌ధాని ఇడార్డ్ హేగ‌ర్ కూడా సోమ‌వారం నుంచి లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నారు. టీకాలు తీసుకోని వారు ఉన్న ప్ర‌దేశాల్లో ఆంక్ష‌ల‌ను అమ‌లు చేసేందుకు జ‌ర్మ‌నీ కూడా సిద్ధ‌మైంది.