
గతంలో చెరకు తయారవ్వాలంటే.. గిర గిర తిప్పుతూ తయారు చేసేవారు. మారుతున్న టెక్నాలజీ ప్రకారం.. జనరేటర్ ను ఓ మిషన్ కు అనుసంధానం చేసి చెరకు రసం తీసేలా మిషన్లు వచ్చాయి. మారుతున్న టెక్నాలజీ ప్రకారం ఇలా బటన్ ప్రెస్ అలా రసం వచ్చే మిషన్లు అందుబాటులోకి వచ్చాయి.
మండిపోతున్న ఎండల్లో చెరకు రసం తాగితే చాలా బావుంటుంది. అప్పటికప్పుడు చెరకును మెషీన్లో వేసి రసం తీసి, దానికి కాస్త నిమ్మరసం, కాసిన్ని ఐస్ ముక్కలు కలిపి ఇస్తుంటారు. మండే వేడిలో చెరకు రసం తాగడానికి అందరూ ఇష్టపడుతుంటారు. కాని చెరుకు రసం అమ్మేవారు .చేతులతో చెరకు తిప్పడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే టెక్నాలజీ డెవలప్ మెంట్ తో చెరుకురసం తీసే మిషన్కు జనరేటర్‌ను అటాచ్ చేస్తారు. అయితే దీనితో మనుషుల కష్టం ఉండదు కాని.. డీజిల్ వాడటం వల్ల కాలుష్యం ఏర్పడుతుంది. దీంతో తాజాగా పర్యావరణానికి విఘాతం కలుగకుండా అత్యాధునిక ఎలక్ట్రిక్ చెరకు రసం మిషన్ లు అందుబాటులోకి వచ్చాయి.
ఆటోమేటెడ్ చెరకు మెషిన్
అత్యాధునిక ఆటోమేటెడ్ మెషిన్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. రిటైర్డ్ ఎయిర్ మార్షల్ (IAF), అనిల్ చోప్రా, ఒక వీడియోను ట్వీట్ చేశారు. ఈ యంత్రంలో కొన్ని బటన్లను ప్రెస్ చేస్తే చెరకు రసం తయారవుతుంది. డియోను షూట్ చేసిన వ్యక్తి అది ఎలా పనిచేస్తుందనే విషయాన్ని తెలుసుకొన్నారు.
వీడియో వైరల్
మిషన్ కు ఉన్న రంధ్రాల్లో చెరకు ముక్క ఉంచి కొన్ని బటన్లు ప్రెస్ చేస్తే దానికున్న ట్యాప్ నుంచి చెరకు రసం వస్తుంది. దీనిని ఒక్కొక్క గ్లాస్ 20 రూపాయిలుకు అమ్ముతున్నట్లు విక్రేతలు చెప్పారంటూ ఆ వీడియోను అనిల్ చోప్రా ట్విట్టర్ లో పోస్ట్ చేయగా.. వైరల్ అయింది. కొద్దిసేపటికే లక్షా 43 వేల 200 మంది చూశారు. కొంతమంది అద్భుతంగా ఉందనగా.. మరి కొంతమంది విమర్శించారు. ఇది చాలా పాతదని ఎనిమిదేళ్ల క్రితమే ...ఇలాంటి మిషన్ ను ఒక షాపింగ్ మాల్ లో చూశానని ట్విట్టర్ యూజర్ ఒకరు తెలిపారు. మరొకరు ఈ యంత్రం నకిలీదంటూ.. పాత యంత్రంలో చెరకురసం ఎలా తయారయ్యే ప్రక్రియను చూస్తాం.. కాబట్టి శుభ్రంగా స్వచ్చంగా రావడం కనిపిస్తుంది. ఈ మిషన్ లో రసం ముందే నింపబడిందని .. రుచిగా, తాజాగా లేదని మరొకరు వాదించారు.
Innovative आत्मनिर्भर India pic.twitter.com/TngLFM9lWv
— Aviator Anil Chopra (@Chopsyturvey) May 11, 2023