ఆటోమేటిక్ గొడుగు.. వర్షం వస్తే దానికదే ఓపెన్ అవుతుంది.. ఎంత గాలి వచ్చినా విరగదు కూడా !

ఆటోమేటిక్ గొడుగు.. వర్షం వస్తే దానికదే ఓపెన్ అవుతుంది.. ఎంత గాలి వచ్చినా విరగదు కూడా !

సాధారణంగా వర్షాకాలంలో స్కూల్‌‌‌‌‌‌‌‌కి వెళ్లే పిల్లలకు గొడుగు ఇచ్చి పంపుతారు. వాళ్లు వర్షం కురిసినప్పుడు బటన్ నొక్కి గొడుగుని తెరుస్తారు. కానీ.. తగ్గాక దాన్ని క్లోజ్‌ చేయడానికి చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతుంటారు. అలాంటివాళ్లకు ఈ గొడుగు ఇస్తే సరిపోతుంది. ఇది ఆటోమెటిక్‌‌‌‌‌‌‌‌గా విచ్చుకోవడమే కాదు. ఒక్క బటన్‌‌‌‌‌‌‌‌ నొక్కితే చాలు దానంతటదే మూసుకుంటుంది కూడా. దీన్ని అనిచో అనే కంపెనీ తీసుకొచ్చింది. సాధారణ గొడుగులు బలమైన గాలి వీచినప్పుడు  పల్టీలు కొడుతుంటాయి. కొన్నిసార్లు విరిగిపోతాయి. కానీ.. ఇది తీవ్రమైన గాలి, వర్షాన్ని కూడా తట్టుకుంటుంది. ఇది యూవీ రేస్‌‌‌‌‌‌‌‌ని అడ్డుకుని చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

సెన్సింగ్‌‌‌‌‌‌‌‌ హోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కొంతమంది ఊరికి వెళ్లేటప్పుడు ఇంట్లో ఒక్క లైట్‌ అయినా ఆన్‌ చేసి పెడతారు. దాంతో అది పొద్దంతా, రాత్రంతా వెలిగి కరెంట్‌‌‌‌‌‌‌‌ బిల్‌‌‌‌‌‌‌‌ పెరిగిపోతుంది. ఈ ఆటోమెటిక్‌‌‌‌‌‌‌‌ హోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌ చేసుకుంటే కరెంట్‌‌‌‌‌‌‌‌ బిల్‌‌‌‌‌‌‌‌ని ఆదా చేసుకోవచ్చు. దీన్ని నైట్‌‌‌‌‌‌‌‌ సెస్స్‌‌‌‌‌‌‌‌ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ లైట్ సెన్సర్ అడాప్టర్ ఆటో ఆన్/ఆఫ్ ఫంక్షనాలిటీతో వస్తుంది. ఇందులో ఉండే సెన్సర్ల వల్ల రాత్రి మాత్రమే బల్బు వెలుగుతుంది. పగటిపూట ఆఫ్ అవుతుంది. దీన్ని సాధారణ బీ22 హోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి బిగించి,  ఇందులో బల్బ్‌‌‌‌‌‌‌‌ పెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని కారిడార్లు, మెట్లు, బాల్కనీల్లో కూడా పెట్టుకోవచ్చు.

►ALSO READ | ఎడమచేతి వాటం వాళ్లకే క్రియేటివిటీ ఎక్కువ.. ఆగస్టు 13న ప్రపంచ లెఫ్ట్ హ్యాండర్స్ డే.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ !