156 పోస్టులకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే

156 పోస్టులకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే

తెలంగాణ వైద్యారోగ్య శాఖ, ఆయూష్ విభాగంలో  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.  మొత్తం 156 వైద్యుల పోస్టుల భర్తీకి మెడిక‌ల్ హెల్త్ స‌ర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను  విడుదల చేసింది. దీని ద్వారా ఆయుర్వేదం 54, హోమియో 33, యునాని 69 వైద్యుల పోస్టులను భర్తీ చేయనున్నారు. 

అర్హులైన అభ్యర్థులు 2023  ఆగస్టు 7వ తేదీ  నుంచి 22 వరకు ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. దరఖాస్తుల ప్రక్రియ, పూర్తి వివరాల కోసం mhsrb.telangana.gov.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ కావొచ్చని మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్  బోర్డు సూచించింది.

విద్యార్హతలు: 

మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేదం) కోసం ఆయుర్వేదంలో డిగ్రీ కలిగి ఉండాలి. 
మెడికల్ ఆఫీసర్ (హోమియో) కోసం హోమియోలో డిగ్రీ ఉండాలి. 
 మెడికల్ ఆఫీసర్ (యునాని) కోసం కోసం యునానిలో డిగ్రీ కలిగి ఉండాలి. 

వయస్సు: దరఖాస్తుదారులు కనీస వయస్సు 18 సంవత్సరాలు కలిగి ఉండాలి. 01/07/2023 నాటికి  గరిష్ట వయసు 44 ఏండ్లకు మించకూడదు

ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము: ప్రతి దరఖాస్తుదారు తప్పనిసరిగా రూ. 500/ చెల్లించాలి. అలాగే  ప్రాసెసింగ్ ఫీజు కింద  దరఖాస్తుదారు తప్పనిసరిగా రూ. 200/ చెల్లించాలి. 
తెలంగాణలోని SC, ST, BC, EWS, PH & తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.