ఆనంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెస్ట్ మూవీ బేబీ

ఆనంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెస్ట్ మూవీ బేబీ

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకుడు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎస్.కె.ఎన్ నిర్మించిన చిత్రం జులై 14న ప్రేక్షకుల ముందుకురానుంది. రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేట్ దగ్గర పడుతుండటం, అలాగే శుక్రవారం తన పుట్టిన రోజు సందర్భంగా నిర్మాత ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.కె.ఎన్ మాట్లాడుతూ ‘ఈ సినిమా హై ఇంటెన్స్ ఎమోషనల్ లవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోరీ.  సీన్స్, డైలాగ్స్ చాలా కొత్తగా ఉంటాయి. 

ఆనంద్, విరాజ్, వైష్ణవి మధ్య జరిగే సీన్లలో కొత్త అప్రోచ్ ఉంటుంది. ఇంటర్వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు పెద్ద షాక్ ఉంటుంది. ఆనంద్ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. ఈ సినిమా తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతుంది. థియేటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి బరువెక్కిన గుండెతో బయటకు వెళతారు. ఇక ఈ బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డే నుంచి ఏడాదికి రెండు సినిమాలు తీయాలనుకుంటున్నా. సాయి రాజేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రెండు సినిమాలు, కలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోటో డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రెండు సినిమాలు, వి.ఐ. ఆనంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాంకృత్యయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక్కో సినిమా చేస్తా. త్వరలో ఒక్కొక్కటి అనౌన్స్ చేస్తాం’ అన్నారు.