బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖఏర్పాటుకు కృషి చేయండి

బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖఏర్పాటుకు కృషి చేయండి
  • ఎస్పీ చీఫ్‌‌ అఖిలేశ్‌‌ యాదవ్‌‌కు బీసీ నేతల వినతి

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు- చేసేలా ప్రధాని మోదీ సర్కార్‌‌‌‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సహకరించాలని సమాజ్‌‌ వాదీ (ఎస్పీ) పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌‌ యాదవ్‌‌కు బీసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీలో జాతీయ బీసీ సంఘం కన్వీనర్‌‌ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో బీసీ నేతలు ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు. బుధవారం ఢిల్లీలోని పార్లమెంట్‌‌ ఆవరణలో ఎంపీలు అఖిలేశ్‌‌ యాదవ్‌‌తో పాటు మల్లు రవి, సురేశ్‌‌ రెడ్డి, రేణుకా చౌదరి, నిరంజన్‌‌ రెడ్డి, డీకే అరుణ కలిశారు.