- లేందటే.. పండుగ తర్వాత సెక్రటేరియెట్ ముట్టడి: జాజుల
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల సమయంలో బీసీ విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు వెంటనే అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. లేకపోతే.. సంక్రాంతి పండుగ తరువాత సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. బీసీ విద్యార్థి సంఘం జాతీయ కమిటీ రూపొందించిన 2026 క్యాలెండర్ ను శుక్రవారం హైదరాబాద్లోని బీసీ భవన్ లో జాజుల ఆవిష్కరించారు.
ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఫీజులు చెల్లిస్తున్నదని అన్నారు. బీసీ విద్యార్థులకు మాత్రం ఫీజులు చెల్లించకుండా తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. దీంతో పేద బీసీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని వెల్లడించారు.
