చేతిలో బీరు బాటిళ్లు.. ట్రిపుల్ రైడింగ్.. బైక్ పై డాన్సులు : ఈ డాక్టర్లు యమా క్రేజీగా ఉన్నారే..!

చేతిలో బీరు బాటిళ్లు.. ట్రిపుల్ రైడింగ్.. బైక్ పై డాన్సులు : ఈ డాక్టర్లు యమా క్రేజీగా ఉన్నారే..!

బెంగళూరులో ఆర్థోపెడిక్స్‌లో మాస్టర్స్ (MS) పూర్తి చేసిన ఆనందంలో ముగ్గురు డాక్టర్లు చేసిన వారిని పని చిక్కుల్లో పడేసింది. నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై ప్రమాదకరంగా ప్రయాణించినందుకు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

సమాచారం ప్రకారం ఎం జరిగిందంటే... గత ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో బిటిఎం లేఅవుట్ నుంచి జయదేవ జంక్షన్ వెళ్లే దారిలో ఒకే బైక్‌పై  ట్రిపుల్ రైడింగ్ చేస్తుండగా.. వీరిలో ఇద్దరికీ హెల్మెట్ కూడా లేదు. వీరంతా కొత్తగా  MS పూర్తి చేసిన డాక్టర్లు. వెనుక కూర్చున్న ఓ డాక్టర్ చేతిలో బీరు బాటిల్ పట్టుకుని తాగుతుండగా.. పక్కన వెళ్తున్న వారు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు.

పోలీసుల యాక్షన్:
వీడియో ఆధారంగా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. బైక్ నంబర్ సాయంతో మొదట బైక్ ఓనర్  ధనుష్‌ను పట్టుకున్నారు. ఆయన ఇచ్చిన సమాచారంతో మిగిలిన ఇద్దరిని స్టేషన్‌కు పిలిపించారు.
 
నిందితులైన యశ్వంత్‌పూర్‌ నివాసి అయినా ధనుష్ (30) సప్తగిరి మెడికల్ కాలేజీలో పనిచేస్తుండగా.. అపూర్వ (30) బొమ్మనహళ్లి నివాసి, ఆమె వైదేహి ఆసుపత్రిలో ఉద్యోగి. అవినాష్ (37) చామరాజపేట నివాసి కాగా.. చాముండేశ్వరి మెడికల్ కాలేజీలో  డాక్టర్ గా గుర్తించారు. 

"మేమంతా ఆర్థోపెడిక్స్‌లో ఎం.ఎస్ పూర్తి చేశాం. ఆ సంతోషంలో ఓ బార్‌లో పార్టీ చేసుకున్నాం. వచ్చేటప్పుడు అవినాష్ సగం తగిన   బీరు బాటిల్‌ను తనతో తెచ్చుకుని, బైక్ వెనుక కూర్చుని తాగాడు అని వారు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా ప్రయాణించినందుకు వీరిపై  FIR నమోదైంది.
 
రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు మార్చి 16 నుంచి 22 వరకు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మొత్తం 45,568 వాహనాలను తనిఖీ చేయగా.. డ్రంక్ అండ్ డ్రైవ్ కింద 634 కేసులు,  ఓవర్ స్పీడ్ కింద 122 కేసులు బుక్కయ్యాయి.  ట్రాఫిక్ ఉల్లంఘనదారుల నుంచి మొత్తం 1.3 లక్షల రూపాయల జరిమానా వసూలు చేశారు.