బెలారస్‌కు చెందిన 19 ఏండ్ల వియలెట బర్జిలియౌస్కయ పారిస్ గేమ్స్‌లో పతకం నెగ్గింది. ఇందులో విశేషం ఏముందంటారా? ఉంది. తమ దేశం పేరు, జెండా లేకుండా బరిలోకి దిగి ఈ గేమ్స్‌లో మెడల్ గెలిచిన తొలి న్యూట్రల్ అథ్లెట్ తను. విమెన్స్ ట్రంపోలిన్ ఈవెంట్‌లో 56.060 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకుంది.
ఉక్రెయిన్‌పై దాడి కారణంగా రష్యా, బెలారస్ అథ్లెట్లను ఈ ఒలింపిక్స్‌లో టీమ్ స్పోర్ట్స్ నుంచి నిషేధించారు. దాంతో బెలారస్‌కు చెందిన 17 మంది క్రీడాకారులు న్యూట్రల్ అథ్లెట్లుగా పోటీ పడుతున్నారు. తమ దేశంపై నిషేధం కారణంగా రెండేండ్లుగా ఇంటర్నేషనల్ ఈవెంట్లకు దూరంగా ఉన్న వియలెట అత్యధిక పోటీ ఉండే ఒలింపిక్స్‌లో పతకం నెగ్గడం విశేషం.