డిమాండ్లు అమలు చేయాలంటూ భారత్ బంద్..

డిమాండ్లు అమలు చేయాలంటూ భారత్ బంద్..

ప్రైవేటు సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు అమలుచేయాలని చేస్తూ.. ఆల్ ఇండియా బ్యాక్ వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయిస్ (BAMCEF) నేటి భారత్ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇవే కాకుండా మరికొన్ని అంశాలనూ తమ జాబితాలో చేరుస్తూ వారు నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమయ్యారు. వాటిలో ముఖ్యంగా..

  • ఓబీసీల జనగణన చేపట్టాలి.
  • ఎన్నికల్లో ఈవీఎం వినియోగాన్ని రద్దు చేయాలి.
  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రైవేటు సెక్టార్లలోనూ రిజర్వేషన్లు కల్పించాలి.
  • వాక్సినేషన్ తప్పనిసరి అనే నిబంధనను తీసివేయాలి.
  • రైతుకు కచ్చితమైన మద్దతు ధర కోసం  ప్రత్యేక చట్టం చేయాలి.
  • పాత పెన్షన్ స్కీమ్ ను అమలులోకి తేవాలి.
  • ట్రైబల్స్(గిరిజనులకు) రక్షణ కల్పించాలి.
  • కొవిడ్ లాక్ డౌన్ లో ఇబ్బందులు ఎదుర్కొన్న వర్కర్స్ కు రక్షణ కల్పించాలి.

ఈ భారత్ బంద్ ప్రభావం ముఖ్యంగా దుకాణాలు, బ్యాంకు, చిన్న వ్యాపార సంస్థలపై ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇవి కాకుండా రవాణా సేవలు, ఆఫీసులు, పాఠశాలలు, కళాశాలు మాత్రం యథావిధిగా కొనసాగనున్నట్టు సమాచారం. ఇకపోతే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టనున్న ఈ భారత్ బంద్ ను అందరూ విజయవంతం చేయాలని ఆకాంక్షిస్తూ.. "గోబ్యాక్ మోడీ" (#GobackModi) అనే హ్యాష్ ట్యాగ్ ను పలువురు ట్యాగ్ చేస్తున్నారు. దీంతో ఈ నినాదం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.