ఫైనల్ మ్యాచ్ కోసం బిగ్ స్క్రీన్లు.. భారీగా బెట్టింగ్

ఫైనల్ మ్యాచ్ కోసం బిగ్ స్క్రీన్లు.. భారీగా బెట్టింగ్

హైదరాబాద్ క్రికెట్ బెట్టింగ్ కు అడ్డాగా మారుతోంది. ఆన్లైన్, ఆఫ్లైన్ లో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. మనీ ట్రాన్సాక్షన్స్ అంతా ఆన్ లైన్ లోనే జరుగుతోంది. నగరంలోని కొన్ని బార్లలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి మరీ బెట్టింగులను ప్రోత్సహిస్తున్నారు.  బెట్టింగ్ మోజులో డబ్బులు కోల్పోతున్నారు యూత్. ఒకప్పుడు మ్యాచ్ విన్నర్ పై బెట్టింగ్ సాగేది. కానీ ఇప్పుడు బాల్ బాల్ కి బెట్టింగ్ జరుగుతోంది. ఆన్ లైన్  పేమెంట్లు ఊపందుకున్నప్పటి నుంచి బెట్టింగ్ జోరందుకుంది . మ్యాచ్ ఎవరు గెలుస్తారు. ఏ బ్యాట్స్ మెన్ ఎన్ని రన్స్ చేస్తారు.. ఏ బౌలర్ ఎన్ని వికెట్లు పడగొడతాడు.. ఏ ఓవర్లో వికెట్ పడుతుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం ఎన్ని రన్స్ చేస్తుంది.. ఇలా మ్యాచుపై రకరకాలుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు ఫంటర్స్.

ఐపీఎల్ మ్యాచులపై బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను నార్త్ జోన్ పోలీసులు పట్టుకున్నారు. ఆన్ లైన్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. సంతోష్, ప్రమోద్, అనిరుద్, ఆంధ్రుస్, శివకుమార్ లను అదుపులోకి తీసుకున్నారు.  నిందితుల నుంచి 55వేలు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.  ఆన్ లైన్ లో ట్రాన్సక్షన్లు జరుగుతుండటంతో బుకీలు, టెకీల సమాచారం తెలుసుకోవడం పోలీసులకు కష్టంగా మారింది. పోలీసులు ఫోకస్ చేయకపోవడం వల్లే బెట్టింగ్ సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా భారీ ఎత్తునా బెట్టింగ్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు ఫోకస్ చేస్తున్నామన్నారు.

కొత్తగూడెం జిల్లా కేంద్రంతో పాటు ఉమ్మడి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న బార్లలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోందని సమాచారం. వారు స్క్రీన్లు ఏర్పాటు చేసి మరి దందా సాగిస్తున్నారని అంటున్నారు. వైన్​ షాపుల్లో సిట్టింగ్లు, బెల్ట్ షాపుల్లోనూ టీవీలు ఏర్పాటు చేయడంతో మందుబాబులు పనిలో పనిగా బెట్టింగులు చేస్తున్నారు. ప్రతియేటా ఐపీఎల్ సీజన్ ఆరంభం నుంచి హడావుడి చేసి కొంతమేర బెట్టింగ్ను నియంత్రిస్తున్న పోలీసులు ఈ ఏడాది దీనిపై అంతగా దృష్టి సారించినట్లు లేదు. ఆన్లైన్ బెట్టింగ్ ఊపందుకోవడంతో పోలీసులకు కూడా బుకీలు, టెకీల సమాచారం తెలుసుకోవడం కష్టంగా మారింది. పోలీసులు. దృష్టి కేంద్రీకరించకపోవడంతోనే జోరుగా బెట్టింగ్ సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

మరిన్ని వార్తల కోసం :-

ఐపీఎల్లో అర్సీబీ బౌలర్ చెత్త రికార్డు


స్టార్ ఆటగాళ్లకు షాక్...టీమ్లో నో ఛాన్స్