ఇండియాకు 43 మెడల్స్‌‌‌‌‌‌‌‌ ఖాయం

ఇండియాకు 43 మెడల్స్‌‌‌‌‌‌‌‌ ఖాయం

ఆస్తానా (కజకిస్తాన్‌‌‌‌‌‌‌‌): ఆసియా అండర్‌‌‌‌‌‌‌‌–22, యూత్‌‌‌‌‌‌‌‌ బాక్సింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా బాక్సర్ల పంచ్‌‌‌‌‌‌‌‌ అదురుతోంది. ఇప్పటి వరకు మొత్తం 43 మెడల్స్‌‌‌‌‌‌‌‌ను ఖాయం చేసుకున్నారు. మెన్స్‌‌‌‌‌‌‌‌ 60 కేజీ సెమీస్‌‌‌‌‌‌‌‌లో సీనియర్‌‌‌‌‌‌‌‌ నేషనల్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌ ఆకాశ్‌‌‌‌‌‌‌‌ గోర్ఖా 5–0తో ఇలసోవ్‌‌‌‌‌‌‌‌ సూయత్‌‌‌‌‌‌‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌‌‌‌‌‌‌)పై గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టాడు. యూత్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌చాంపియన్‌‌‌‌‌‌‌‌ విశ్వనాథ్‌‌‌‌‌‌‌‌ సురేశ్‌‌‌‌‌‌‌‌ (48 కేజీ) కూడా 5–2తో బరికుట్రో బ్రయాన్‌‌‌‌‌‌‌‌ (ఫిలిప్పీన్స్‌‌‌‌‌‌‌‌)ను ఓడించి టైటిల్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించాడు.

ఇక నిఖిల్‌‌‌‌‌‌‌‌ (57 కేజీ), ప్రీత్‌‌‌‌‌‌‌‌ మాలిక్‌‌‌‌‌‌‌‌ (67 కేజీ) 5–2 తేడాతో వరుసగా డొరియాంబు గన్‌‌‌‌‌‌‌‌బోల్డ్‌‌‌‌‌‌‌‌ (మంగోలియా)పై, అల్మాజ్‌‌‌‌‌‌‌‌ ఒర్జాబెకోవ్‌‌‌‌‌‌‌‌ (కిర్గిస్తాన్‌‌‌‌‌‌‌‌)పై నెగ్గి గోల్డ్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించారు. అయితే జుడామణి సింగ్‌‌‌‌‌‌‌‌ (51 కేజీ), అజయ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ (63.5 కేజీ), అంకుష్‌‌‌‌‌‌‌‌ (71 కేజీ), ధ్రువ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ (80 కేజీ), జుగ్నో (86 కేజీ), యువరాజ్‌‌‌‌‌‌‌‌ (92 కేజీ) సెమీస్‌‌‌‌‌‌‌‌ ఓడి బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టుకున్నారు.