- రాజ్యసభలో ఆర్.కృష్ణయ్య
న్యూఢిల్లీ, వెలుగు: దేశంలోని ఉన్నత విద్యా వ్యవస్థలో నాణ్యత క్షీణిస్తోందని, ఇది ఆందోళన కలిగించే విషయమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు. దేశంలో ఉన్నత విద్య నాణ్యతను మెరుగుపర్చాలన్నారు.
అవసరమైన అధ్యాపకులు, విద్యార్థుల ప్రొఫైల్, మౌలిక సదుపాయాలు, పాఠ్యాంశాలు, బోధనా విధానం మొదలైన వాటి విషయంలో కేంద్రం ఫోకస్ పెట్టాలని సూచించారు. ప్రస్తుతం యూజీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.
