V6 News

బొల్లారం డివిజన్ను శేరిలింగంపల్లి జోన్లో కలపండి : బొల్లారం నాయకులు

బొల్లారం డివిజన్ను శేరిలింగంపల్లి జోన్లో కలపండి : బొల్లారం నాయకులు
  • డిప్యూటీ కమిషనర్​ కిషన్​కు వినతి పత్రం అందజేసిన  బొల్లారం నాయకులు 

అమీన్​పూర్​, జిన్నారం, వెలుగు : మున్సిపాలిటీ నుంచి జీహెచ్ఎంసీలో కలిసిన బొల్లారం డివిజన్​ను శేరిలింగంపల్లి జోన్​లో కలపాలని బొల్లారం నాయకులు డిప్యూటీ కమిషనర్​ కిషన్​ను కోరారు. ఈ మేరకు గురువారం మాజీ జడ్పీటీసీ కొలను బాల్​రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్​ కౌన్సిలర్​లు డిప్యూటీ కమిషనర్​ కిషన్​కు వినతి పత్రాన్ని అందజేశారు. పటాన్​చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్​, అమీన్​పూర్​ డివిజన్​లను శేరిలింగంపల్లి జోన్​లో కలిపినట్లుగానే బొల్లారం డివిజన్​ శేరిలింగంపల్లి జోన్​లో కలపాలని కోరారు. 

బొల్లారం డివిజ్​ను కూకట్​పల్లి డివిజన్​లో కలపడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. డిప్యూటీ కమిషనర్​ను కలిసిన వారిలో మాజీ కౌన్సిలర్​లు వేణుపాల్​రెడ్డి, జైపాల్​రెడ్డి, సాయికిరణ్​రెడ్డి, బీరప్ప, శ్రీకాంత్​యాదవ్, సతీశ్, మాజీ ఎంపీటీసీ రత్నం పాల్గొన్నారు.