బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. నటుడు, జాతీయ అవార్డు గ్రహీత పంకజ్ త్రిపాఠి తల్లి హేమవంతి దేవి (89) కన్నుమూశారు. ఆమె రెండు రోజుల కిందట, అంటే శుక్రవారం (2025 అక్టోబర్ 31న) బీహార్‌లోని తన ఇంట్లో దీర్ఘకాలిక అనారోగ్యంతో మరణించారని త్రిపాఠి కుటుంబం ధృవీకరించింది. శనివారం (నవంబర్ 1న) ఆమె అంత్యక్రియలు కూడా పూర్తయినట్లు పంకజ్ టీమ్ వెల్లడించింది. ఆమె చివరి క్షణాలలో.. పంకజ్ త్రిపాఠి తన తల్లి దగ్గరే ఉన్నారని తెలిపింది.
2023లో 99 ఏళ్ల వయసులో పంకజ్ తండ్రి పండిట్ బనారస్ తివారీ మరణించారు. ఇపుడు ఈ రెండేళ్ల వ్యవధిలో పంకజ్ తల్లి కూడా మరణించడంతో పంకజ్ ఫ్యామిలీ విషాదంలో మునిగింది. ఈ క్లిష్ట సమయంలో త్రిపాఠి ఫ్యామిలీ ధైర్యంగా ఉండాలని సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, ఆయన ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
నటుడు పంకజ్ త్రిపాఠి సినీ విషయానికి వస్తే.. 'క్రిమినల్ జస్టిస్', 'మీర్జాపూర్', 'గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్' వెబ్ సిరీస్ లతో తెలుగు ఆడియన్స్ కు బాగా పాపులర్ అయ్యారు. ఈ సిరీస్ లలో తన పాత్రకు ఆడియన్స్ నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. 2021లో మిమి చిత్రానికి గానూ పంకజ్.. జాతీయ అవార్డు గెలుచుకున్నారు.
