కాబుల్ ఎయిర్ పోర్టు వద్ద బాంబు దాడి

కాబుల్ ఎయిర్ పోర్టు వద్ద బాంబు దాడి

కాబూల్‌: అప్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద బాంబు పేలుడు జరిగింది. ఆత్మాహుతి దాడి జరిగినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి బయట పడేందుకు వేలాది మంది ఎయిర్‌ పోర్టు వద్ద గుమిగూడుతున్నారు. మరో వైపు వివిధ దేశాల అధికారులే కాదు విదేశీ ప్రజలు కూడా కాబూల్‌ నుంచి స్వదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అమెరికా రక్షణశాఖ అనుమానించినట్లే కొద్దిసేపటి క్రితం బాంబు పేలుడు జరిగింది. అధికారులు, జర్నలిస్టులు ఉన్న విమానం టేకాఫ్ అయిన సమయంలోనే ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించి బాంబు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఎంత మేర ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు వచ్చే వారం జర్మనీ ఛాన్సలర్‌ మెర్కల్‌ తన ఇజ్రాయిల్‌ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఆఫ్గన్‌ నుంచి తమ దళాలను వెనక్కి రప్పించే కార్యక్రమంలో ఆమె బిజీగా ఉన్నారని, అందుకే విదేశీ పర్యటన రద్దయిందని అధికార వర్గాలు అంటున్నాయి. కాల్పుల తర్వాతే పేలుడు జరిగిందని పెంటగాన్ నిర్ధారించింది.