అమ్రావతి MP నవనీత్ కౌర్‌కు బాంబే హైకోర్టు షాకిచ్చింది. ఆమె ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు చేసింది. దీంతో పాటు రూ. 2 లక్షలు జరిమానా విధించింది. ఎన్నికల సమయంలో నవనీత్ కౌర్ తప్పుడు సర్టిఫికెట్ సమర్పించారని శివసేన నేత బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. ఆమె ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికెట్ ఫేక్ అని తేల్చింది. దీంతో ఆమె చిక్కుల్లో పడ్డారు.
మహారాష్ట్రలోని అమ్రావతి ఎస్సీ రిజర్వ్ లోక్‌సభ స్థానం నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నవనీత్ కౌర్ విజయం సాధించారు. ఆరు నెలల్లోగా తన సర్టిఫికెట్లు కోర్టు ముందుంచాలని ఆమెను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ప్రస్తుతం నవనీత్ కౌర్ ఎంపీ పదవి ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది. అయితే నవనీత్ కౌర్ సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
