Good Food : షుగర్ ఉన్నోళ్లు.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కింద ఈ టిఫిన్ తినండి.. షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి..!

Good Food : షుగర్ ఉన్నోళ్లు.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కింద ఈ టిఫిన్ తినండి.. షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి..!

ఈ రోజుల్లో వృద్ధుల్లోనే  కాదు యువతలో కూడా  డయాబెటిస్ వ్యాపిస్తుంది. అయితే డయాబెటిస్ అనేది ఒక  తీవ్రమైన దీర్ఘకాల వ్యాధి.  డయాబెటిస్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువవుతుంటాయి. క్లోమం తగినంత ఇన్సులిన్‌ ఉత్పత్తి చేయనప్పుడు లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ని శరీరం ఉపయోగించుకోనప్పుడు ఇలా జరుగుతుంది. దింతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. మీరు తీసుకునే ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది, కాబట్టి మీరు ఎం తింటున్నారో గమనించడం చాలా ముఖ్యం.

ప్రతిరోజు పొద్దున్నే  మీరు అల్పాహారం(టిఫిన్) చేస్తుంటారు. అయితే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు తక్కువ చక్కెర ఉన్న ఆహారాన్ని టిఫిన్లగా తీసుకోవాలి. మధుమేహం తగ్గడానికి ఉపదయోగపడే అల్పాహారం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇంకా ఒకోసారి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవచ్చు. రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నవారి కోసం తక్కువ-చక్కెర ఉన్న  కొన్ని బెస్ట్ టిఫిన్స్ ఇదిగో.....   

 1. కూరగాయల ఉప్మా: ఉప్మాను ఎక్కువగా బొంబాయి రవ్వతో చేస్తారు. అయితే మధుమేహం ఉన్నవారు గోధుమ రవ్వ లేదా ఓట్స్‌తో ఉప్మా చేసుకోవడం మంచిది. ఉప్మాలో క్యారెట్లు, బఠానీలు వంటి ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు వేయడం వల్ల ఉప్మా ఆరోగ్యకరంగా అవుతుంది. 

2. పెసరట్టు : పెసరట్టులో ప్రోటీన్ ఎక్కువగా, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. పెసరట్టు పెసరపప్పు పిండితో చేస్తారు. పాలకూర, ఉల్లిపాయలు, టమోటాలు వంటి కూరగాయలు కలిపితే దీనిలో పోషక విలువలు పెరిగి, రక్తంలో చక్కెరను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది.

3. ఓట్స్ ఇడ్లీ: మాములు బియ్యంతో ఇడ్లీలు కాకూండా ఓట్స్‌తో చేసిన ఇడ్లీలు మంచి అప్షన్. ఓట్స్‌లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అందుకే  త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది, ఇంకా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా  చూస్తుంది. 

4.  శనగపిండి దోస: శనగపిండితో  చేసే దోసలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇదొక కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే టిఫిన్. ఇందులో ఉల్లిపాయలు, టమోటాలు లేదా పాలకూర కలపడం వల్ల పోషక విలువలు చాలా పెరుగుతాయి.

5. పోహ: పోహాను కూరగాయలు, తక్కువ నూనెతో తయారు చేస్తే చాల తేలికైన, కడుపు నింపే టిఫిన్  అవుతుంది. తెల్ల పోహా కాకుండా  బ్రౌన్ లేదా రెడ్ రైస్ పోహా తినడం వల్ల ఫైబర్ తీసుకోవడం పెరుగుతుంది.

6. మొలకల సలాడ్: మొలకెత్తిన పేసర్లు  (Sproutes),  కట్ చేసిన  దోసకాయలు, ఉల్లిపాయలు, టమోటాలతో కలిపి తీసుకుంటే పోషకాలతో నిండిన టిఫిన్   అవుతుంది. మొలకలు నెమ్మదిగా జీర్ణమవుతాయి, దీనివల్ల భోజనం తర్వాత చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి.

7. రాగి దోసె లేదా గంజి: రాగులలో (ఫింగర్ మిల్లెట్) కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. రాగి దోసె లేదా గంజి నెమ్మదిగా జీర్ణమవుతాయి. ఇంకా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూస్తుంది.

ఈ టిఫిన్స్ అన్ని మీ రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడంలో  సహాయపడతాయి. అయితే ఏవైనా ఆహార అలవాట్ల మార్పులు లేదా  టిఫిన్స్  అలవాటు చేసుకునే చేసే ముందు డాక్టర్స్ లేదా న్యూట్రీషనిస్ట్ సలహా తీసుకోవడం మంచిది.