తీవ్ర సంక్షోభంలో బ్రిటన్ ప్రభుత్వం

తీవ్ర సంక్షోభంలో బ్రిటన్ ప్రభుత్వం

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడింది. ఆయన నాయకత్వంపై విశ్వాసం కోల్పోయిన మంత్రుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోయింది. ప్రధాని పదవి నుంచి జాన్సన్ వైదొలగాలని మంగళవారం ఇద్దరు కేబినెట్ మంత్రులు రాజీనామా చేశారు. ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్, ఆర్థికశాఖ మంత్రి రిషి సునాక్ రాజీనామా చేయగా.. బుధవారం మరో 15 మంది మంత్రులు వారికి జత కలిశారు. దౌత్యాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు వరుస పెట్టి రాజీనామాలు చేస్తున్నారు. నిన్నటి వరకు ప్రభుత్వాన్ని వీడిన వారి సంఖ్య 37కి చేరింది. అయితే.. సొంతపార్టీ సభ్యులు, విపక్షఘాల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నా ప్రధాని పదవి వీడేది లేదని స్పష్టం చేశారు బోరిస్ జాన్సన్. ఆర్ధిక మాంద్యం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల పెనుసవాళ్లను ఎదుర్కొంటోందని.. ఇటువంటి టైంలో బాధ్యతల నుంచి పారియేది లేదన్నారు.