కాంగ్రెస్​ పార్టీలో చేరిన బీఆర్‌‌ఎస్ నాయకులు

కాంగ్రెస్​ పార్టీలో  చేరిన  బీఆర్‌‌ఎస్ నాయకులు

బెల్లంపల్లిరూరల్​,వెలుగు: కాసిపేట మండలానికి చెందిన బీఆర్‌‌ఎస్ నాయకులు గురువారం హైదరాబాద్​లో ఎమ్మెల్యే గడ్డం వినోద్​ సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలో చేరారు. మాజీ వైస్​ఎంపీపీ పుస్కూరి విక్రమ్​రావు, ఓరియంట్​ సిమెంట్​వర్కింగ్​ప్రెసిడెంట్​ తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు శ్రీనివాస్​, సుమలత, ముత్యంపల్లి మాజీ ఎంపీటీసీ భీమయ్య, బీఆర్​ఎస్​ దేవాపూర్​ టౌన్​ ప్రసిడెంట్​ వడ్లూరి మల్లేశ్​, నాయకులు వేణు, శ్యాంసింగ్​, సందీప్​, రాజేశ్వర్​రెడ్డి, ప్రవీణ్​, మధు, రాజు, కొమ్ము సతీష్​, యాదవ సంఘం కులస్తులు లక్ష్మయ్య, వేలుపల రవి, పోశం, ప్రసాద్​తో పాటు పలువురు పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వనించారు.