బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. పోటా పోటీగా నీళ్ల లొల్లి

 బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. పోటా పోటీగా నీళ్ల లొల్లి
  • మేడిగడ్డ X పాలమూరు
  •  రేపు కాళేశ్వరానికి గులాబీ లీడర్లు
  •  ‘పాలమూరు’ చుక్క నీరివ్వలే
  •  దమ్ముంటే పోటీకి రమ్మంటున్న వంశీచంద్ రెడ్డి


హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నీళ్ల లొల్లి తారస్థాయికి చేరింది. రేపు ఉదయం బీఆర్ఎస్ లీడర్లు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు సిద్ధమవుతున్న తరుణంలో కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో స్వరాన్ని పెంచింది. లక్ష కోట్ల దోపిడీ చేసి ఏం చూసేందుకు వెళ్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఓట్లతో ఎంపీగా గెలిచిన కేసీఆర్ కృష్ణా నీళ్లన్నింటినీ ఆంధ్రాకు అప్పగించారని మండిపడుతోంది. పాలమూరుకు కేసీఆర్ చేసిన అన్యాయాలపై వంశీచంద్ రెడ్డి ఓ బ్రోచర్ ప్రింట్ చేయించారు. దానిని మీడియాకు విడుదల చేశారు.  ఇదిలా ఉండగా చలో మేడిగడ్డ ప్రోగ్రామ్ కు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లకు రిపేర్లు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తోందని ఆరోపిస్తోంది. 

హరీశ్ వెళ్తారా లేదా..?

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్ రావు మేడిగడ్డ సందర్శనకు వెళ్తారా..? లేదా..? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆయనకు అన్ని విషయాలు తెలుసునని ఆయన ప్రజెంటేషన్ ఇస్తేనే బాగుంటుందని గులాబీ లీడర్లు కొందరు చెబుతున్నారు. కేటీఆర్ మంత్రి హోదాలో ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ ను సందర్శించలేదు.  దానిపై కనీస అవగాహన లేకుండా ఏం మాట్లాడుతారన్న గుసగుసలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ALSO READ :- వాట్​టు డు.. వాట్ నాట్ టు డు

కేసిఆర్ హాజరై దెబ్బతిన్న పిల్లర్లు, కుంగుతున్న వాల్స్, బీటలు వారుతున్న లైనింగ్ లు చూసి రిటైర్డ్ ఇంజనీర్ల బృందంతో చెప్పిస్తే బాగుంటుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ చర్చల నేపథ్యంలో కేసీఆర్ తో హరీశ్​ రావు భేటీ అయ్యారని తెలుస్తోంది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాల పేరుతో ఒక బుక్ లెట్ ప్రింట్ చేయించినట్టు తెలుస్తోంది. దానికి ప్రాజెక్టు సందర్శనలో భాగంగా మీడియాకు అందించనున్నారని సమాచారం.