వాట్​టు డు.. వాట్ నాట్ టు డు

వాట్​టు డు.. వాట్ నాట్ టు డు
  • మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి ఆసక్తికర ట్వీట్
  •  బీజేపీ జాతీయ నాయకులందరికీ ట్యాగ్
  •  చిన్నపిల్లాడు తిరుగుతున్న వీడియో పోస్ట్
  •  గతంలోనూ దున్నపోతును బండెక్కిస్తున్న ఫొటోతో ట్వీట్

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి ఆసక్తికర ట్వీట్​చేశారు.  ‘వాట్ టు డు, వాట్ నాట్ టు డు’ అంటూ ఎన్నికల ముందు ఆలోచిస్తున్నట్లు ఫన్నీ వీడియో షేర్ చేశారు. అందులో చిన్నపిల్లాడు బట్టలు లేకుండా థింక్ చేస్తూ అటు ఇటూ తిరుగుతున్నాడు. ఇక, ఈ వీడియోను ప్రధాని మోదీ, అమిత్‌ షా, సునీల్‌ బన్సల్‌, తరుణ్‌చుగ్‌, జేపీ నడ్డా, శివప్రకాశ్‌కు ట్యాగ్‌ చేశారు.

ALSO READ :-  Hero Vida V1 Plus : ఎలక్ట్రిక్ బైక్ హీరో విడా మళ్లీ వచ్చింది.. రూ.30 వేల భారీ డిస్కౌంట్తో

 కాగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జితేందర్‌ రెడ్డి మహబూబ్‌ నగర్‌ ఎంపీ టికెట్‌ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ముందు బీజేపీ అధిష్టానం ఆలోచన తీరుపై ఆయన ఇలా సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారనే ప్రచారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. గతంలో దున్నపోతును వాహనంలో ఎక్కించి కొట్టే వీడియోను జితేందర్ రెడ్డి షేర్‌ చేయడం బీజేపీలో పెనుదుమారమే రేపింది. తాజాగా ఈ వీడియో హాట్ టాపిక్​గా మారింది. పార్టీపై తన నిరసనను ఇలా వ్యక్తం చేస్తున్నారనే కామెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి.