పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్కు 80వ స్థానం.. వీసా లేకుండా 62 దేశాలు తిరగొచ్చు

పాస్పోర్ట్ ఇండెక్స్లో  భారత్కు 80వ స్థానం.. వీసా లేకుండా 62 దేశాలు తిరగొచ్చు
  • సింగపూర్కు ఫస్ట్ ర్యాంక్ 
  • ఆ దేశస్తులు188 కంట్రీస్కు వీసా లేకుండా వెళ్లే చాన్స్ 
  • చివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్
  • హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్–2026 రిలీజ్

భారత పాస్పోర్ట్ బలపడింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్-2026లో భారత్ ఐదు స్థానాలు ఎగబాకి 80వ స్థానానికి చేరుకుంది. భారత పాస్పోర్ట్ ప్రస్తుతం 62 దేశాలకు వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్ తో ప్రయాణించే అవకాశం ఉంది. గత అంతర్జాతీయ ప్రయాణ స్వేచ్ఛలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోంది. 

లండన్ కేంద్రంగా పనిచేసే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్2 విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ లో.. సింగపూర్ పాస్పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తి మంతమైనదిగా నిలిచింది. సింగపూర్ పౌరులకు 192 దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్ లభిస్తోంది. జపాన్, దక్షిణ కొరియా రెండో స్థానంలో నిలిచి 188 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం పొందాయి. అత్యల్ప శక్తివంతమైన పాస్పోర్ట్ ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో నిలిచింది. ఆ దేశ పాస్పోర్ట్  కేవలం 24 దేశాలకు మాత్రమే వీసా లేకుండా వెళ్లగల పరిస్థితి ఉంది. 

ప్రపంచ ప్రయాణ స్వేచ్ఛలో అసమానతలు పెరుగుతున్నాయని హెన్లీ నివేదిక స్పష్టం చేసింది. యూరప్ దేశాలు టాప్ ర్యాంకుల్లో ఆధిపత్యం కొనసాగిస్తుండగా, యునైటెడ్  అరబ్ ఎమిరేట్స్ ఐదో స్థానానికి చేరి ప్రత్యేకగుర్తింపు సాధించింది. యూఏఈ పాస్పోర్ట్ తో 184 దేశాలకు వీసా అవసరం లేదు. ఆస్ట్రేలియా, కెనడా, మలేసియా టాప్-10లో చోటు దక్కించుకోగా, అమెరికా మళ్లీ పదో
స్థానానికి చేరింది. భారత్ ర్యాంకు మెరుగుపడటం దేశానికి పెరుగుతున్న అంతర్జాతీయ ప్రాధాన్యతకు సంకేతమని నిపుణులు చెబుతున్నారు.