Pawan Kalyan: మెగా అభిమానులకు ‘పవర్’ ఫుల్ భోగి గిఫ్ట్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో మరో క్రేజీ ప్రాజెక్ట్?

Pawan Kalyan: మెగా అభిమానులకు ‘పవర్’ ఫుల్ భోగి గిఫ్ట్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో మరో క్రేజీ ప్రాజెక్ట్?

 సంక్రాంతి సంబరాల వేళపవర్ స్టార్ పవన్ కల్యాణ్  మెగా అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు.  భోగి పండుగ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని.. పవన్ కళ్యాణ్ తన భవిష్యత్తు చిత్రాలపై కీలక అడుగులు వేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి. విశ్వప్రసాద్‌తో పవన్ ఈరోజు ప్రత్యేకంగా సమావేశమైయ్యారు. తదుపరి చిత్రాలపై సుదీర్ఘంగా చర్చించారు.

తన సొంత బ్యానర్ భాగస్వామ్యంతో.. 

గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘బ్రో’ (Bro) చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి సందడి చేసింది. ఇప్పుడు అదే ఊపును కొనసాగిస్తూ.. తన సొంత బ్యానర్ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ భాగస్వామ్యంలో మరిన్ని భారీ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు పవన్ సిద్ధమవుతున్నారు. ఈ భేటీలో రాబోయే ప్రాజెక్టుల స్క్రిప్ట్‌లు, షూటింగ్ షెడ్యూల్స్ గురించి సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.

బిజీ షెడ్యూల్‌లోనూ..

రాజకీయ బాధ్యతలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, తన కోసం ఎదురుచూస్తున్న నిర్మాతలు, అభిమానుల కోసం పవన్ తన సినీ కమిట్‌మెంట్ల విషయంలో మరింత స్పీడ్ పెంచాలని  నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాను నిర్మాత రామ్‌ తాళ్లూరి నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారు. వీటితో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో మరో కొత్త సినిమా ఉండబోతుందనే వార్త మెగా ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

షూటింగ్‌లకు ముహూర్తం ఖరారు?

తాజా సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ తన పెండింగ్ సినిమాల షూటింగ్‌లను శరవేగంగా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ముఖ్యంగా ‘ ఉస్తాద్ భగత్ సింగ్ ’ చిత్రంపై అంచనాలు  భారీగా ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రాబోయే ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి మరిన్ని అధికారిక వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. మొత్తానికి, బాక్సాఫీస్ వద్ద అన్నయ్య చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్‌ గారు’తో మ్యాజిక్ చేస్తుంటే.. తమ్ముడు పవన్ కళ్యాణ్ తన అప్‌డేట్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఈ సంక్రాంతి మెగా అభిమానులకు డబుల్ ట్రీట్ అని చెప్పక తప్పదు.