కేస్లాపూర్ జాతర.. ఇంద్రా దేవికి పూజలు.. మర్రి చెట్టుపై గంగా జలం భద్రపర్చిన మెస్రం వంశీయులు

కేస్లాపూర్ జాతర.. ఇంద్రా దేవికి పూజలు.. మర్రి చెట్టుపై గంగా జలం భద్రపర్చిన మెస్రం వంశీయులు
  • కేస్లాపూర్కు పయనమైన పూజారులు

హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇందవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరలో భాగంగా ఇంద్రాదేవికి పూజలు నిర్వహించారు మెస్రం వంశీయులు. మహాపూజకు అవసరమైన పవిత్ర గంగాజలాన్ని జన్నారం మండలంలోని హస్తిన మడు గు నుంచి తెస్తున్నమెస్రం వంశీయులు ఇవాళ (జనవరి 14) ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకున్నారు. 

సంప్రదాయ వాయిద్యాల మధ్య వచ్చి ఆలయం ఎదుట ఉన్న మర్రి చెట్టుపై గంగాజలం భద్ర పరిచారు. ఇంద్రాదేవికి పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం కేస్లా పూర్ కు బయల్దేరి వెళ్లారు. అక్కడి మర్రి చెట్లపై గంగా జలాన్ని ఉంచి జనవరి 28 మహా పూజ రోజున ప్రత్యేకంగా నాగోబాకు అభిషేకాలు చేస్తారు.