సింగపూర్‌‌‌‌కు కేటీఆర్

సింగపూర్‌‌‌‌కు కేటీఆర్
  • కూతురు కాలేజీ చదువులకోసం  కుటుంబంతో కలిసి విదేశీ పర్యటన

 

హైదరాబాద్‌‌, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లారు. తన కుటుంబంతో కలిసి శుక్రవారం సింగపూర్‌‌‌‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన తన కుమార్తె స్టడీస్‌‌ కోసం పలు కాలేజీలను పరిశీలించనున్నట్లు సమాచారం. మళ్లీ  సోమవారం హైదరాబాద్‌‌కు తిరిగి వచ్చి యథావిధిగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొననున్నారు.

కాంగ్రెస్​ పాలనలో ఆర్థిక విధ్వంసం: కేటీఆర్​

కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరుగుతున్నదని కేటీఆర్ ఆరోపించారు. సెప్టెంబర్ నెలలో  జీఎస్టీ వసూళ్ల వృద్ధి రేటులో దేశంలోనే తెలంగాణ అట్టడుగున ఉండటం దారుణమన్నారు. తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి సంబంధించిన మరో స్పష్టమైన సూచిక ఇదేనని ఆయన ట్వీట్‌‌ చేశారు  సరిగ్గా రెండేండ్ల క్రితం కేసీఆర్ సమర్థ పాలనలో దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని తెలిపారు.