ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో .. మరోసారి అప్రూవర్​గా రామచంద్ర పిళ్లై?

 ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో .. మరోసారి అప్రూవర్​గా రామచంద్ర పిళ్లై?

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో మరోసారి కీలక పరిణామం చోటుచేసుకుంది. దర్యాప్తు సంస్థలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బినామీగా పేర్కొంటున్న హైదరాబాద్ బేస్డ్ లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై మరోసారి అప్రూవర్​గా మారినట్టు తెలిసింది. లిక్కర్ స్కామ్​లో నిందితుడిగా ఉన్న పిళ్లై నుంచి సీఆర్పీసీ సెక్షన్ 164 కింద ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పిళ్లై స్టేట్మెంట్​ను రికార్డు చేసినట్టు సమాచారం.

ALSO READ:తెలంగాణలో ఓట్లను చెల్లాచెదురు చేసిన్రు: మర్రి శశిధర్రెడ్డి 

త్వరలో కోర్టులో హాజరుపరచనున్నట్టు తెలిసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్​కు సంబంధించి మనీలాండరింగ్ వ్యవహారంలో ఈ ఏడాది మార్చి 7న ఈడీ పిళ్లైని అరెస్ట్ చేసింది. అతని నుంచి  సౌత్ గ్రూప్ పాత్ర, హవాలా రూపంలో డబ్బుల మళ్లింపు విషయాలపై స్టేట్మెంట్ నమోదు చేసింది. ముఖ్యంగా సౌత్ గ్రూప్ నుంచి కిక్ బ్యాక్​ల రూపంలో ఆప్ లీడర్ విజయ్ నాయర్ కు చేర వేసిన రూ.100 కోట్లు పై ఆరా తీసింది. కాగా, మార్చి 11న తొలిసారి ఈడీ ముందుకు కవిత విచాణకు హాజరయ్యే టైంలో పిళ్లై యూటర్న్ తీసుకున్నారు.