ఇంటింటికీ సీపీఐ పేరుతో ప్రచారం : చాడ వెంకట్‌‌ రెడ్డి

ఇంటింటికీ సీపీఐ పేరుతో ప్రచారం : చాడ వెంకట్‌‌ రెడ్డి
  • రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి: చాడ వెంకట్‌‌ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ‘ఇంటింటికీ సీపీఐ’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని పార్టీ కార్యకర్తలకు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి సూచించారు. పార్టీ లక్ష్యాలను వివరిస్తూ.. వారి వద్ద చందాలను వసూలు చేసి మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ హిమాయత్ నగర్‌‌‌‌లోని రాజ్ బహదూర్‌‌‌‌హాల్‌‌లో సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటీ నర్సింహ, కలవేణి శంకర్, శ్రామిక మహిళా ఫోరం జాతీయ నాయకురాలు ప్రేమ్ పావని, రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘ అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్‌‌తో కలిసి సీపీఐ రాష్ట్ర 4వ మహాసభల లోగోను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ.. మేడ్చల్ జిల్లాలో వేలాది మందికి గుడిసెలను వేసి, భూములను పంచిన చరిత్ర సీపీఐ పార్టీకి ఉందన్నారు. మహాసభల అనంతరం ప్రభుత్వ భూములను పేదలకు పంచడానికి ఉద్యమం కొనసాగిస్తామని చెప్పారు.