
హైదరాబాద్- లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే బ్యాంకులు పని వేళల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోస్ట్ ఆఫీసులు కూడా పని వేళల్లో మార్పులు చేశాయి. లాక్ డౌన్ ఆంక్షలకు అనుగుణంగా పోస్ట్ ఆఫీస్ పని వేళలను కుదిస్తు గురువారం నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పెద్ద పోస్ట్ ఆఫీసుల్లో కౌంటర్లు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పని చేస్తాయని.. అలాగే చిన్న పోస్ట్ ఆఫీసుల్లో ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు పని చేయనున్నాయని తెలిపారు. గురువారం నుండి ఈ నిర్ణయం అమల్లోకి రానుందని.. శుక్రవారం నుండి ఈ గౌడ్ లైన్స్ ప్రకారమే ఆఫీసులు పని చేస్తాయన్నారు. ఈ మేరకు సీనియర్ సూపరింటెండెంట్, సికింద్రాబాద్ డివిజన్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. లాక్ డౌన్ కారణంగా కార్యాలయాలు తక్కువ మంది సిబ్బందితో పని చేస్తాయని.. డెలివరీ సహా ఇతర సేవలు గతంలో మాదిరి కొనసాగుతాయని తెలిపింది. ఈ పని వేలలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసులకు వర్తించనున్నాయి.