ఏక్‌నాథ్ షిండేకు గ్రాండ్ వెల్కమ్

ఏక్‌నాథ్ షిండేకు గ్రాండ్ వెల్కమ్

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఏక్‌నాథ్ షిండే తన స్వస్థలమైన థానేకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆయన సతీమణి లతా ఏక్‌నాథ్ షిండే బ్యాండ్ వాయిస్తూ గ్రాండ్ గా భర్తకు వెల్కమ్ చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీఎం అయ్యాక షిండే తొలిసారి స్వంత ఇంటికి వచ్చిన  నేపథ్యంలో మద్దతుదారులు ఆయనకు  పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. భారీ వర్షం పడతున్నా లెక్క చేయలేదు.  రాత్రి 9.30 గంటల ప్రాంతంలో షిండే  థానేకు చేరుకున్నారు.  షిండే రాజకీయ జీవితంలో లతా షిండేది కీలకమైన పాత్రనే చెప్పాలి.  వీరికి ముగ్గురు పిల్లలు కాగా 2000 సంవత్సరంలో జరిగిన బోటు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు.  నిన్న శాసనసభలో షిండే మాట్లాడుతూ చనిపోయిన తన ఇద్దరు చిన్నారులను తలుచుకుని కన్నీరుమున్నీరయ్యారు.